ప్రపంచంలో.. ఎక్కడ ఏం జరుగుతోంది!!

  • 23 మార్చి 2018
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ట్రంప్.. జిన్ పింగ్
  • చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సుంకాన్ని భారీగా పెంచేసింది. 60 బిలియన్ డాలర్ల మేర సుంకాన్ని విధించేందుకు వీలుగా వాషింగ్టన్‌లో ఒక ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చౌర్యం ద్వారా చైనా గత ఏడాది అమెరికాకు వందల కోట్ల డాలర్ల నష్టం కలిగించిందని పేర్కొన్నారు. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా తాజా నిర్ణయైం పోరాటం చేస్తామని తెలిపింది.
  • జాతీయ భద్రతా సలహాదారు జనరల్ హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్‌ను డొనాల్డ్ ట్రంప్ ఆ పదవి నుంచి తొలగించారు. ఈ స్థానంలో జాన్ బోల్టన్‌ను నియమించారు. బోల్టన్ గతంలో ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించేవారు.
Image copyright Getty Images
  • వెనెజువెలా కరెన్సీ బొలివర్‌ను రీ వాల్యువేట్ చేయనున్నట్లు ఈ దేశ అధ్యక్షుడు నికోలస్ మాదురో వెల్లడించారు. వెనెజువెలా ప్రపంచంలోనే అత్యంత అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడ నిత్యావసరాల కోసం తీవ్ర కొరత నెలకొంది.
  • విదేశాలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో నైజీరియాకు చెందిన నేరగాళ్ల ముఠా గుట్టును రట్టు చేశామని యూరోపియన్ పాలసీ ఏజెన్సీ.. యూరోపోల్ వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో స్పెయిన్ పోలీసులు 39 మంది మహిళలు, బాలికలను రక్షించారు. వ్యభిచారంలోకి దించడానికి వీరిని గుహల్లో దాచినట్లు పోలీసులు వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)