బీ కేర్‌ఫుల్: బరువు పెరిగితే.. క్యాన్సర్ ముప్పు

  • 24 మార్చి 2018
మహిళ Image copyright PA
చిత్రం శీర్షిక బ్రిటన్‌లోని క్యాన్సర్ బాధితుల్లో 6.3 శాతం మందికి అధిక బరువు, ఊబకాయమే కారణమట

అధిక బరువు కారణంగా క్యాన్సర్‌‌ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చిరిస్తున్నారు.

ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జీవన శైలిలో మార్పులు చేసుకుంటే 37.7 శాతం క్యాన్సర్‌‌ కేసులను తగ్గించుకునే వీలుందని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు.

బ్రిటన్‌లోని క్యాన్సర్‌‌ బాధితుల్లో 6.3 శాతం మందికి అధిక బరువు, ఊబకాయమే కారణమని తాజాగా 'క్యాన్సర్‌‌ రీసెర్చ్ యూకే' అనే సంస్థ జరిపిన పరిశీలనలో వెల్లడైంది.

ఇదే సంస్థ 2011లో జరిపిన అధ్యయనంలో అది 5.5 శాతంగా ఉన్నట్టు తేలింది. అంటే 0.8 శాతం పెరిగింది.

దీంతో ప్రమాదకరంగా మారుతున్న ఊబకాయం బారిన పడకుండా అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.

అయితే, ఇదే సమయంలో పొగతాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌‌ కేసులు 19.4 శాతం నుంచి 15.1శాతానికి తగ్గినట్టు తేలింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రిటన్‌లోని క్యాన్సర్‌‌ కేసుల్లో 3.3% కేసులకు కారణం ఆల్కహాల్

మద్యం సేవించడం తగ్గించి, పొగ తాగడం మానేసి, శరీర బరువును అదుపులో పెట్టుకోగలగితే బ్రిటన్‌లో 10 క్యాన్సర్‌‌ కేసుల్లో నాలుగింటిని నివారించే వీలుందని పరిశోధకులు అంచనా వేశారు.


ఏ కారణంతో ఎన్ని క్యాన్సర్‌ కేసులు నమోదు అవుతున్నాయో చూద్దాం:

కారణం(నివారించదగిన) నమోదవుతున్న కేసులు
ధూమపానం 15.1 శాతం
అధిక బరువు, ఊబకాయం 6.3 శాతం
అతినీల లోహిత కిరణాల తాకిడి 3.8 శాతం
వృత్తి పరమైన కారణాలు 3.8 శాతం
ఇన్ఫెక్షన్లు 3.6 శాతం
మద్యం(ఆల్కహాల్) 3.3 శాతం
పీచు పదార్థాల లోపం 3.3 శాతం
రేడియేషన్ 1.9 శాతం
శుద్ధి చేసిన మాంసం 1.5 శాతం
వాయు కాలుష్యం 1 శాతం
శారీరక శ్రమ లేకపోవడం 0.5 శాతం

పై జాబితాలో పేర్కొన్న కారణాలన్నీ నివారించదగినవే. అందుకు కావాల్సిందల్లా జీవన శైలిలో మార్పులు చేసుకోవడమే.

ఈ విషయాల పట్ల జాగ్రత్త పాటిస్తే ఒక్క బ్రిటన్‌లోనే ప్రస్తుతం ఉన్న క్యాన్సర్‌‌ బాధితుల్లో 135,000 కేసులను నివారించదగినవే అని పరిశోధకులు వెల్లడించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)