రష్యాలో అగ్ని ప్రమాదం: అది నేరపూరిత నిర్లక్ష్యం - పుతిన్

  • 27 మార్చి 2018
మృతులకు నివాళి అర్పిస్తున్న స్థానికులు Image copyright AFP

రష్యాలోని సైబీరియన్ సిటీ కెమెరోవోలో ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 64 మంది చనిపోయారు. ఈ ఘటనకు నిరసనగా వందల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.

అంతకు ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఘటన స్థలాన్ని సందర్శించి ఇది నేర పూరిత నిర్లక్ష్యమని వ్యాఖ్యానించారు.

ప్రాణాలు కల్పోయిన వారిలో 41 మంది చిన్నారులున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు మాట్లాడుతూ.. ‘‘ఈ భవనంలో ఫైర్ అలారం‌లను స్విచాఫ్ చేశారని.. అత్యవసర ద్వారాలను లాక్ చేసి ఉంచారని..’’ తెలిపారు.

అయితే ఇప్పటికీ ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

ఇక్కడి వింటర్ చెర్రీ కాంప్లెక్స్‌లోని పై అంతస్థులో మంటలు మొదలయ్యాయి.

బాధితుల్లో ఎక్కువ మంది ఇక్కడి థియేటర్లలో ఉన్నవారేనని స్థానికులు చెబుతున్నారు.

ఆదివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వ్యాప్తిలోకి వచ్చింది.

పలువురు ఈ కాంప్లెక్స్ కిటికీల్లో నుంచి బయటకు దూకడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు.

కెమెరోవోలో బొగ్గును ఉత్పత్తి చేస్తారు. ఇది మాస్కోకి 3600 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రమాదానికి కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం ఎక్కడ మొదలైంది?

ఈ కాంప్లెక్స్‌ని 2013లో ప్రారంభించారు. ఇందులో సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, సానా, చిన్నారుల కోసం జూ ఉన్నాయి.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయత్రం 5.00 గంటలకు ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. రెండు థియేటర్లలో పై కప్పు కూలిపోయింది.

ఇక్కడ 288 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారని స్థానిక అధికారులు తెలిపారు.

వంద మందికిపైగా ప్రజలను ఈ అగ్ని ప్రమాదం నుంచి రక్షించినట్లు వివరించారు.

తొమ్మిది మంది చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

అక్కడ గ్రహాంతర జీవులున్నాయా.. ఎవరూ రావొద్దని అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఎందుకు హెచ్చరించింది

"కుల్‌భూషణ్ జాధవ్ కేసులో ఐసీజే ఉత్తర్వును గౌరవించకపోతే పాక్‌పై ఐరాస ఆంక్షలకు ప్రయత్నిస్తాం"

ప్రెస్ రివ్యూ: మోదీది ఓ గెలుపా? ఏంపనిచేసి గెలిచారు? -కేసీఆర్

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన కెప్టెన్.. వైట్ హౌస్‌లో అడుగు పెట్టబోనని ఎందుకు అన్నారు?

బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్‌లోని ఫొటోల్లో నిజమెంత

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...