స్టార్మీ డేనియల్స్: ట్రంప్ ఆ విషయం చెప్పొద్దని బెదిరించారు

  • 26 మార్చి 2018
స్టార్మీ డేనియల్స్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక స్టార్మీ డేనియల్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2006లో తనతో సెక్స్ చేశారని.. పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు. ‘ఆ విషయాన్ని’ బయటకు చెప్పవద్దనీ బెదిరించారని చెప్పారు.

2011లో లాస్ వెగాస్‌లో కార్ పార్క్ వద్ద ఓ వ్యక్తి తనను వెంబడించారనీ ఆమె సీబీఎస్ న్యూస్‌కి వెల్లడించారు.

అతను ‘ట్రంప్‌ను వదిలేయ్.. లేకుంటే ఈమె తల్లికి (కూతుర్ని చూస్తూ) ఏమైనా జరిగితే బాగుండదు..’ అని చెప్పి వెళ్లాడు అని స్టార్మీ చెప్పారు.

ట్రంప్ ఈమెతో సంబంధాన్ని తీవ్రంగా తోసిపుచ్చారు.

ట్రంప్ న్యాయవాదులు ఆమె 2016 ఎన్నికలకు ముందు ట్రంప్‌తో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ ఆమెపై 2 కోట్ల డాలర్ల పరువు నష్టం దావా వేశారు.

అయితే ఆ దావా చెల్లదని స్టార్మీ చెబుతున్నారు.

కాలిఫోర్నియాలో జులై 2006లో సెలిబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ జరుగుతున్నపుడు ఓ హోటల్ రూంలో తాను, ట్రంప్ సెక్స్ చేశామని ఆమె తెలిపారు.

ట్రంప్ 2005లో మెలనియా ట్రంప్‌ను పెళ్లి చేసుకున్నారు.

స్టార్మీ అసలేమన్నారు?

ఆదివారం సాయంత్రం ప్రసారమైన సీబీఎస్‌ షోలో మాట్లాడుతూ.. లాస్ వెగాస్ కార్ పార్క్ వద్ద జరిగిన సంఘటనను వివరించారు.

‘‘నేను నా స్టోరీని ఓ మేగజీన్‌కి వివరించేందుకు అంగీకరించా. అప్పుడు లాస్ వెగాస్‌లో అతడు నా దగ్గరకు వచ్చి ఆ స్టోరీని మరిచిపో..’’ అని బెదిరించారు.

అయితే తాజా ఆరోపణలపై ట్రంప్ స్పందించలేదు.

Image copyright Reuters

ఆ రోజు ఏం జరిగింది?

ఆ రోజు హోటల్లో ఇలా జరిగిందంటూ.. స్టార్మీ పలు వివరాలు వెల్లడించారు.

‘‘ట్రంప్ నన్ను డిన్నర్‌కి తన హోటల్‌కి ఆహ్వానించారు. వెళ్లా. అప్పుడు ట్రంప్ నన్ను సమీపించారు. తన ప్యాంట్ కొంచెం కిందకు దించారు. లో దుస్తులు వేసుకుని ఉన్నారు. నేను అడ్డు చెప్ప లేదు. తర్వాత.. ఇద్దరం సెక్స్ చేశాం.’’ అని తెలిపారు.

‘ట్రంప్ టీవీ గేమ్ షోలో అవకాశంలో భాగంగా ఇదో డీల్ అయి ఉంటుందని అనుకున్నా..’ అని వివరించారు.

2016 ఎన్నికల ముందు ట్రంప్ లాయర్.. నాకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారు. ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దన్నారు.. అని స్టార్మీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)