ఉత్తర కొరియా: రైలులో కిమ్ చైనా యాత్ర... జిన్‌పింగ్‌తో భేటీ

  • 28 మార్చి 2018
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్-ఉన్, ఆయన భార్య లి షూ (ఎడమ) చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌లను బీజింగ్‌లో కలిసిన ఫొటోలను చైనా అధికారిక వార్తా సంస్థ జిన్‌హువా విడుదల చేసింది Image copyright XINHUA
చిత్రం శీర్షిక ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్-ఉన్, ఆయన భార్య లి షూ (ఎడమ) చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌లను బీజింగ్‌లో కలిసిన ఫొటోలను చైనా అధికారిక వార్తా సంస్థ జిన్‌హువా విడుదల చేసింది

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చైనా పర్యటన నిజమేనని చైనా అధికారిక మీడియా సంస్థ ధృవీకరించింది. ప్రత్యేక రైలులో కిమ్ చైనాలో అడుగుపెట్టారని జిన్‌హువా వెల్లడించింది.

"ఉన్నత స్థాయి వ్యక్తి ఒకరు ప్రత్యేక రైలులో చైనా వచ్చారు" అంటూ వారం రోజులుగా మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఆ ప్రత్యేక వ్యక్తి కిమ్ అంటూ జపాన్ మీడియా తొలిసారి వెల్లడించింది.

కిమ్ 2011లో ఉత్తర కొరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే.

Image copyright XINHUA

జిన్‌హువా వార్తా సంస్థ కథనం ప్రకారం.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు కిమ్ మార్చి 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ‘అనధికారిక పర్యటన’కు వచ్చారు.

కిమ్‌తో పాటు ఆయన భార్య లి షూ, కొరియన్ వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ వైస్ చైర్మన్ చోయిలతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక కిమ్ చైనా పర్యటనకు సంబంధించి జపాన్ మీడియా ముందుగా వెల్లడించింది

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కిమ్ సమావేశమయ్యారని, వీరి మధ్య చర్చలు అర్థవంతంగా జరిగాయని జిన్‌హువా పేర్కొంది.

దక్షిణ కొరియా, అమెరికాలతో చర్చలకు తాము సిద్ధమని కిమ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Image copyright XINHUA

కిమ్‌తో సమావేశం కావడానికి తాను సిద్ధంగానే ఉన్నానని గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

ఉత్తర కొరియాకు చైనా ప్రధాన ఆర్థిక భాగస్వామి. అందువల్ల ట్రంప్‌తో సమావేశానికి ముందుగా కచ్చితంగా కిమ్ చైనా నాయకత్వంతో సమావేశం జరుపుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.

Image copyright XINHUA
చిత్రం శీర్షిక కిమ్ చైనా పర్యటనలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు

అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా కట్టుబడి ఉందని జిన్‌పింగ్‌తో సమావేశంలో కిమ్ వెల్లడించినట్లు జిన్‌హువా పేర్కొంది.

ఈ పర్యటన చైనా - ఉత్తర కొరియాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే చర్యగా ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

జపాన్‌లో ఐదు నెలల్లో 1,000 లోపే కోవిడ్ మరణాలు... జపనీయుల అజేయ శక్తి వెనుక మిస్టరీ ఏమిటి?

బంగారంతో మాస్క్: కరోనాను అడ్డుకుంటుందా?

వందేళ్లకు పైగా వాడుతున్న ‘స్వస్తిక’ చిహ్నాన్ని నిశబ్దంగా తొలగించారు.. ఎందుకంటే...

హయా సోఫియా: నాడు చర్చి, మసీదు, మ్యూజియం.. మళ్లీ మసీదుగా మారుస్తారా?

కరోనావైరస్‌తో పోయిన ‘వాసన, రుచి’ తిరిగి వస్తున్నాయా? ఎంత కాలం పడుతోంది?

చైనాపై అమెరికా, బ్రిటన్ కీలక చర్యలు.. అదే బాటలో ఆస్ట్రేలియా, జపాన్, తైవాన్, కెనడా

నాగాలాండ్‌, మిజోరం‌లలో కుక్క మాంసాన్ని ఇప్పుడే ఎందుకు నిషేధించారు?

బీబీసీ లైవ్‌షోలో మాట్లాడుతున్న అమ్మను కూతురు ఏం చేసిందో చూడండి..

రకుల్ ప్రీత్ సింగ్: ‘దాని గురించి మాట్లాడొద్దు, మగవాళ్లకు లేనప్పుడు మాకెందుకు’