స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై ఏడాది నిషేధం - ఐపీఎల్‌లోనూ వేటు

 • 28 మార్చి 2018
స్టీవ్ స్మిత్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక స్టీవ్ స్మిత్

బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై క్రికెట్ ఆస్ర్టేలియా ఏడాది పాటు నిషేధం విధించింది.

బాల్ ట్యాపంరింగ్‌కి పాల్పడిన బ్యాన్ క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలలు వేటు వేశారు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కలిసి బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడిన సంగతి తెలిసిందే.

ఈ అంశంపై ఆస్ర్టేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారం దేశాన్నే దిగ్ర్భాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు.

వార్నర్‌ను ఇకపై ఏ జట్టు కెప్టెన్‌గానూ పరిశీలించబోమని క్రికెట్ ఆస్ర్టేలియా వెల్లడించింది.

ఐపీఎల్లో కూడా వీరిద్దరినీ ఈ సీజన్‌కు నిషేధిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. వీరిద్దరి స్థానంలో ఆయా జట్లు కొత్త ఆటగాళ్లను తీసుకుంటాయని తెలిపారు.

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తప్పుకున్నాడు.

మరో ఫ్రాంచైజీ అయిన 'రాజస్థాన్ రాయల్స్' సారథ్య బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఇంతకుముందే వైదొలిగాడు.


Image copyright Getty Images
చిత్రం శీర్షిక స్మిత్, వార్నర్

క్రికెట్ ఆస్ట్రేలియా ఏమంటోందంటే..

 • స్మిత్‌కి బాల్ ట్యాంపరింగ్ చేసే పథకం గురించి ముందే తెలుసు
 • అతను ఈ ప్రణాళికను అడ్డుకోవడంలో విఫలమయ్యాడు.
 • ట్యాంపరింగ్ విషయాన్ని రహస్యంగా ఉంచాలని సూచించాడు.
 • బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ చేసిన విషయంలో అధికారులను, ఇతరులను తప్పుదారి పట్టించాడు.
 • ఈ ప్లాన్‌కి సంబంధించి బహిరంగంగా తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేశాడు.
Image copyright Getty Images
చిత్రం శీర్షిక డేవిడ్ వార్నర్

మరి వార్నర్

 • బాల్ ట్యాంపరింగ్ చేసేందుకు ప్రణాళిక రూపొందించింది ఇతనే
 • శాండ్ పేపర్ ద్వారా ట్యాంపర్ చేయాలని జూనియర్ ఆటగాళ్లకు సూచించాడు.
 • బాల్‌ను ఎలా ట్యాంపర్ చేయాలో జూనియర్ ఆటగాళ్లకు నేర్పించాడు.
 • ఈ ప్లాన్‌ను అడ్డుకోవడంలో.. ఈ సమాచారాన్ని అధికారులకు చెప్పడంలో విఫలమయ్యాడు.
 • బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ చేసిన విషయంలో అధికారులను, ఇతరులను తప్పుదారి పట్టించాడు.

ఆస్ట్రేలియా టీంకి సంబంధించినంత వరకు స్మిత్ చాలా కీలక ఆటగాడు.

64 టెస్ట్ మ్యాచుల్లో 6199 పరుగులు తీశాడు. 23 సెంచరీలు చేశాడు.

ఇతన్ని 2015లో టెస్ట్ కెప్టెన్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)