వెనుజువెలా: పోలీస్ స్టేషన్‌లో అల్లర్లు.. 68 మంది మృతి

  • 29 మార్చి 2018
పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన మృతుల బంధువులు Image copyright Reuters
చిత్రం శీర్షిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన మృతుల బంధువులు

వెనుజువెలాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో అల్లర్లు చెలరేగటంతో మంటల్లో 68 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

స్టేషన్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జైలులో ఖైదీలు పరుపులకు నిప్పు పెట్టడంతో మంటలు భారీగా ఎగిసిపడినట్టు చెప్తున్నారు.

ఈ ఘటన కరబోబో రాష్ట్రంలోని వాలెన్సియా పట్టణంలో చోటుచేసుకుంది. దీనిపై అత్యవసర విచారణకు ఆదేశించినట్టు రాష్ట్ర ప్రధాన ప్రాసిక్యూటర్ టారెక్ సాబ్ తెలిపారు.

ఈ ఘటన గురించి వార్తలు వచ్చిన వెంటనే ఖైదీల బంధువులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి రాళ్లు రువ్వారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

పొగ కమ్ముకోవడంతో చాలామంది ఖైదీలు ఊపిరాడక చనిపోయారని వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల్లో ఖైదీలను చూసేందుకు లోపలికి వెళ్లిన పలువురు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

కిక్కిరిసే జైళ్లు..

Image copyright Reuters
చిత్రం శీర్షిక పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టిన ఖైదీల బంధువులు

హింసాత్మక ఘటనలు, అల్లర్ల కారణంగా వెనుజువెలా లోని జైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దాంతో జైళ్లలోనూ అనేక సార్లు ప్రమాదాలు, అల్లర్లు జరిగాయి.

తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఈ దేశంలో ఖైదీలను పోషించలేక ప్రభుత్వం నానా తిప్పలుపడాల్సి వస్తోంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు

ఏపీలో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం..

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

మోదీకి గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే అవార్డుపై అభ్యంతరాలు ఎందుకు?

ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?

ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?

పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా

చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...