స్విత్ భావోద్వేగం
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు బాల్‌ను ట్యాంపర్ చేసిన వ్యవహారంలో.. ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్షమాపణలు కోరారు. భావోద్వేగంతో మాట్లడాడిన ఆయన ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారు.
బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో స్మిత్‌తో పాటు ఈ జట్టులోని మరో ఆటగాడు డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది.
బాన్ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం ఉంది.
ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ సిడ్నీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇది నా కెప్టెన్సీకి జరిగిన ఓటమి అని వ్యాఖ్యనించారు.
స్టీవ్‌తో పాటు వార్నర్, బాన్ క్రాఫ్ట్ కూడా తమ చర్యల పట్ల విచారం వ్యక్తం చేశారు.
విలేకర్ల సమావేశంలో స్టీవ్ స్మిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ దృశ్యాలను పై వీడియోలో చూడొచ్చు.
అంతకు ముందు
ఐపీఎల్ 2018కి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా కేన్ విలియమ్స్‌ని నియమించారు.
ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కె.షణ్ముగం గురువారం తెలిపారు.
‘‘కేన్ విలియమ్స్‌ని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.’’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కేన్ విలియమ్స్ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో సన్ రైజర్స్ కెప్టెన్‌గా ఉంటాను. ప్రతిభావంతులైన కుర్రాళ్లున్న జట్టుకు కెప్టెన్‌గా ఉండటం చాలా మంచి అవకాశం.’’ అని అన్నారు.
ఈ మాటలను సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
కేన్ విలియమ్స్ న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కూడా.

ఫొటో సోర్స్, Getty Images
డేవిడ్ వార్నర్
'సన్‌రైజర్స్ హైదరాబాద్' కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తప్పుకున్నారు.
కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.
ఇదే వివాదం కారణంగా, ఐపీఎల్‌లో మరో ఫ్రాంచైజీ అయిన 'రాజస్థాన్ రాయల్స్' సారథ్య బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా వైదొలగారు.
''ఇటీవలి పరిణామాల నేపథ్యంలో 'సన్‌రైజర్స్ హైదరాబాద్' కెప్టెన్ బాధ్యతల నుంచి డేవిడ్ వార్నర్ వైదొలిగారు'' అని ఫ్రాంచైజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) కె.షణ్ముగం బుధవారం 'ట్విటర్'లో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)