ప్రధానమంత్రి కావాలన్న ఆశ లేదు.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ప్రధానమంత్రి కావాలన్న ఆశ లేదు!: మలాలా

  • 31 మార్చి 2018

"ఈ గాలీ, ఈ నేలా, ఇక్కడి వాతావరణం నాకెంతో ఇష్టం. స్వాత్ లాంటి అందమైన చోటు నాకు మరెక్కడా కనిపించలేదు" అని నోబెల్ శాంతి పురస్కార విజేత మలాలా యూసుఫ్‌జయ్ అన్నారు.

తనపై తాలిబాన్ దాడి తర్వాత ఈ వారమే స్వదేశానికి వచ్చిన మలాలా బీబీసీ పాకిస్తాన్ ప్రతినిధి ఫర్హద్ జావేద్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

"నాకు ప్రధానమంత్రి కావాలన్న ఆశ లేదు. ఏ వృత్తిలో ఉన్నా సమాజంలో మార్పు కోసం కృషి చేయొచ్చు. రాజకీయ నాయకులు విద్య, వైద్య రంగాల మీద దృష్టి సారించాలి. ఆరోగ్యవంతమైన, చదువుకున్న తరం వల్లనే ఆర్థికాభివృద్ధి సాధ్యం" అని ఆమె అన్నారు.

ఇంకా మలాలా ఏమేం అన్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)