బెల్జియంలో గుజరాతీ ఘుమఘుమలు

భోజనం చేస్తున్న యువతి

బెల్జియంలోని యాంట్‌వర్ప్ నగరానికి ప్రపంచ వజ్రాల రాజధాని అని పేరు. ఈ నగరంలో సుమారు 600 గుజరాతీ కుటుంబాలున్నాయి. మొదట ఇక్కడికి వలస వచ్చిన గుజరాతీలలో జైనులు ఎక్కువ.

మతపరమైన కారణాల వల్ల జైనుల ఆహారపు అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి. 50 ఏళ్ల క్రితం ఇక్కడి రెస్టారెంట్లలో జైనుల ఆహారం దొరికేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం ఇక్కడి ఇటాలియన్, మెక్సికన్ రెస్టారెంట్లలో ప్రత్యేకమైన జైన్ మెనూలు కనిపిస్తాయి.

ఇది యాంట్‌వర్ప్‌లోని ట్రోపికోస్. గుజరాతీయులకు బాగా నచ్చే రెస్టారెంట్. బ్రెజిలియన్, మెక్సికన్ ఫుడ్‌లో ప్రత్యేకంగా జైనుల కోసం తరచుగా ట్రోపికోస్‌కు వస్తుంటారు. అయితే వాటిలో కూడా ఉల్లి, వెల్లుల్లి ఉండకూడదు. మసాలా దినుసులు వీరికి బాగా ఇష్టం.

ఇక్కడి చెఫ్ బార్తె సోమ్వెకు జైనుల ఆహారపు అలవాట్ల గురించి బాగా తెలుసు.

వీడియో క్యాప్షన్,

వీడియో: జైన్ మెనూ కావాలంటే ఒక రోజు ముందు చెప్పాల్సి ఉంటుంది

''జైనుల ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి ఉండకూదు. అందువల్ల వాళ్ల కోసం అవి లేకుండా ఆహారపదార్థాలు తయారు చేస్తాం'' అని సోమ్వె తెలిపారు.

ఒక డిష్ జైనులు తినవచ్చా లేదా అన్నది చెప్పడానికి ఇక్కడ ప్రత్యేకమైన పద్ధతి అవలంబిస్తారు. ఆహారపదార్థాల వద్ద ఆకుపచ్చని ఆలివ్ ఆకు ఉంటే అది జైనుల ఆహారం, అదే నల్లని ఆలివ్ ఆకు ఉంటే అది వాళ్లు తినకూడనిది.

ట్రోపికోస్ ఒక్కటే కాదు, యాంట్‌వర్ప్‌లోని అనేక రెస్టారెంట్లలో కూడా జైనుల ఆహారపు అలవాట్లు తెలుసు. అవి కూడా ప్రత్యేకమైన జైన్ మెనూను తయారు చేస్తున్నాయి.

అయితే జైన్ మెనూ కావాలంటే ఒక రోజు ముందు చెప్పాల్సి ఉంటుంది.

మొత్తమ్మీద బెల్జియం రెస్టారెంట్లలో గుజరాతీ ఘుమఘుమల రుచి చూడాలంటే యాంట్‌వర్ప్‌కు వెళ్లాల్సిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)