బట్టతలకు పరిష్కారం ఉందా?

బట్టతలకు పరిష్కారం ఉందా?

మనకు సాధారణంగా రోజూ కొన్ని వెంట్రుకలు రాలుతుంటాయి. ఈ రాలడం ఎక్కువైతే ఏం చేయాలి? వైద్యుల వద్దకు ఎప్పుడెళ్లాలి? ఈ వీడియో కథనంలో చూడండి.

మహిళలకు కూడా వెంట్రుకలు రాలుతాయి. కాకపోతే మగవాళ్లతో పోలిస్తే కాస్త ఆలస్యంగా రాలుతాయి.

పుట్టేప్పుడే తలలో లక్షకు పైగా వెంట్రుకలతో మనం పుడతాం. ప్రతిరోజూ 100 వెంట్రుకల దాకా రాలుతాయి.

అయితే.. రాలిపోతున్న వెంట్రుకల్ని చూసి ఆందోళన చెందితే అది మరింత పెరుగుతుంది.

వెంట్రుకలు సాధారణంగా మూడు నుంచి ఐదేళ్లపాటు పెరుగుతాయి. ఆ తర్వాత 100 రోజుల పాటు రాలే దశ ఉంటుంది.

ఈ సహజ ప్రక్రియకు ఆటంకాలు సృష్టిస్తే వెంట్రుకలు పెరిగే దశకు వెళ్లకుండా రాలే దశలోనే ఉండిపోతాయి.

ఒకవేళ రెండు నెలల పాటు తీవ్రంగా వెంట్రుకలు రాలిపోతుంటే కనుక డాక్టర్‌ను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ వికీ జోలిఫె చెబుతున్నారు.

వెంట్రుకలు ఎందుకు రాలిపోతున్నాయో గుర్తించి, చర్మ వ్యాధి నిపుణుల సహకారంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆమె అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)