హాకింగ్ అంతిమ యాత్ర: 76 సార్లు మోగిన చర్చి గంట
ప్రఖ్యాత శాస్ర్తవేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ అంత్యక్రియలు శనివారం జరిగాయి. ఆయన 76 ఏళ్ల వయసుకు గుర్తుగా చర్చిలో 76 సార్లు గంట మోగించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రొఫెసర్ హాకింగ్ మార్చి 14న కేంబ్రిడ్జ్ లోని తన నివాసంలో చనిపోయారు. ఆయన వయసు 76 ఏళ్లు. అంతిమ యాత్ర సందర్భంగా జనం పెద్దఎత్తున రోడ్లకు ఇరువైపులా నిల్చున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
స్టీఫెన్ హాకింగ్ గత కొన్నేళ్ల నుంచి మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈయనకు 76 ఏళ్లు కావడంతో అంత్యక్రియల సందర్భంగా 76 సార్లు చర్చి గంటను మోగించారు.
ఫొటో సోర్స్, Getty Images
కేంబ్రిడ్జ్ సిటీ సెంటర్ మధ్య నుంచి స్టీఫెన్ హాకింగ్ అంతిమ యాత్ర. నటుడు ఎడ్డీ రెడ్మేన్ కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
స్టీఫెన్ హాకింగ్ మొదటి భార్య జేన్ హాకింగ్, వారి కుమారుడు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హాకింగ్ కుటుంబ సభ్యులు చర్చిలో శవపేటిక వెంట నడిచారు.
ఫొటో సోర్స్, Getty Images
హాకింగ్ భౌతిక కాయానికి కేంబ్రిడ్జ్లోని గ్రేట్ సెయింట్ మేరీస్ యూనివర్సిటీ చర్చిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు 500 మందిని ఆహ్వానించారు. వారిలో కొందరు సంతాప సందేశాలను రాసే దృశ్యాలను ఈ చిత్రంలో చూడొచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
స్టీఫెన్ హాకింగ్ కొన్నేళ్ల పాటు చక్రాల కుర్చీలోనే జీవనం గడిపారు.
స్టీఫెన్ హాకింగ్: గ్రహాంతర జీవులు ఉన్నాయని బలంగా నమ్మే ఈ శాస్త్రవేత్త ఇంకా ఏం చెప్పారు?
'కాలం కథ'ను సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పిన శాస్త్రవేత్త. విశ్వాంతరాలలోని నిగూఢ రహస్యాలను విప్పిన పరిశోధకుడు స్టీఫెన్ హాకింగ్.