ఈయన 22వ సారి ఎవరెస్ట్ ఎక్కబోతున్నారు!

కామి రితా
చాలా మందికి ప్రపంచంలో అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాన్ని ఒకసారి ఎక్కడమంటేనే ఒక అద్భుతమైన అనుభవం.
కానీ 48 ఏళ్ల నేపాలీ పర్వతారోహకుడు కామి రితాకు మాత్రం అలా కాదు.
ఆయన ఎక్కువ సార్లు మౌంట్ ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించిన వ్యక్తిగా రికార్డును బద్దలు చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం 21 సార్లు విజయవంతంగా ఎవరెస్టును అధిరోహించిన రికార్డు కామి రితా, మరో ఇద్దరు నేపాలీ షెర్పాల పేరిట ఉంది.
తన సహచరులు ఇద్దరూ రిటైర్ కాగా, ఇప్పుడు కామి రితా కొత్త రికార్డును తన పేరిట లిఖించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
''నా ప్రయత్నంతో చరిత్ర సృష్టించాలని, షెర్పాలు, నేపాల్ గర్వించేలా చేయాలని భావిస్తున్నాను'' అన్నారు రితా.
అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహించే అమెరికా సంస్థ తరపున రితా గైడ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆయన మొదటిసారిగా 1994లో, చివరిసారిగా పోయిన ఏడాది మేలో ఎవరెస్టును అధిరోహించారు.
విదేశీ పర్యాటకులు సాధారణంగా ఎవరెస్టును అధిరోహించడంలో ఇలాంటి అనుభవజ్ఞులైన షెర్పాల సహాయం తీసుకుంటారు.
తన 22వ ప్రయత్నంలో రితా వెంట 29 పర్వతారోహకులు ఎవరెస్టును అధిరోహించనున్నారు.
ఆదివారం బేస్ క్యాంప్‌కు బయలుదేరిన వీరు, రెండు వారాల తర్వాత శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభిస్తారు.
''అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, మే 29న శిఖరాగ్రానికి చేరుకొనే అవకాశం ఉంది'' అని కామి రితా 'ద ఖాట్మండు పోస్ట్'కు తెలిపారు.
ఈసారి ఎవరెస్టును అధిరోహించినా అక్కడితో ఆగిపోనని రితా అన్నారు. 25 సార్లు ఎవరెస్టును అధిరోహించి చరిత్రను సృష్టించాలన్నదే తన లక్ష్యం అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)