ఐఎస్ తీవ్రవాదులు దోచుకున్న కళాఖండాలివి

  • 3 ఏప్రిల్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఐఎస్ తీవ్రవాదులు దోచుకున్న కళాఖండాలివి

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో హత్యలతో పాటు అనేక దోపిడీలు చోటుచేసుకున్నాయి. వాటిలో భాగంగా లిబియాలోని పురాతన కట్టడాల నుంచి విలువైన అనేక పురాతన వస్తువులను కూడా తీవ్రవాదులు దోచుకున్నట్లు భావిస్తున్నారు.

అలా ఐఎస్ తీవ్రవాదుల నుంచి చేతులు మారిన విలువైన కళాఖండాలను స్పెయిన్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు వాటిని ఐఎస్ నుంచి కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. వాళ్లిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆసియా లేదా మధ్య ప్రాచ్య దేశాల మీదుగా ఈ కళాఖండాలను తరలించినట్లు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)