కామన్‌వెల్త్ డైరీ: భారతీయ యువతి చేతిలో ఆస్ట్రేలియా జెండా

  • 4 ఏప్రిల్ 2018
రుపిందర్ కౌర్ సంధు Image copyright Rupinder Kaur Wrestler/Facebook

కామన్‌వెల్త్ గేమ్స్ విలేజ్‌లోకి నేను అడుగుపెట్టే సమయానికి ఎదురుగా ఓ భారతీయ యువతి కనిపించారు. ఆమె చేతిలో ఆస్ట్రేలియా జాతీయ జెండా ఉంది. విషయమేంటని ఆరాతీస్తే.. ఆమె రెజ్లింగ్‌లో 48కేజీల విభాగంలో ఆస్ట్రేలియా తరఫున పోటీపడనున్నట్లు తెలిసింది.

ఆ క్రీడాకారిణి పేరు రుపిందర్ కౌర్ సంధు. ఆమె స్వస్థలం పంజాబ్‌లోని అమృత్‌సర్. పదేళ్ల క్రితం ఆమె కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వచ్చింది.

గతేడాది రుపిందర్ ఆస్ట్రేలియా నేషనల్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నారు. కొన్ని రోజుల క్రితం జొహనెస్‌బర్గ్‌లో జరిగిన కామన్‌వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్‌‌షిప్‌లో ఆస్ట్రేలియా తరఫున కాంస్య పతకాన్నీ సొంతం చేసుకున్నారు.

2014లో గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో రుపిందర్‌కు అదృష్టం కలిసిరాలేదు. ఆ పోటీల్లో ఆమె రెజ్లింగ్‌లో 48కేజీల విభాగంలో పాల్గొనాలని ప్రయత్నించారు. కానీ ఉండాల్సిన దానికంటే 200గ్రాములు ఎక్కువ బరువుండటంతో తప్పనిసరై ఆమె 53కేజీల విభాగంలో పోటీ పడ్డారు. దాంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

Image copyright Rupinder Kaur Wrestler/Facebook

ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే ఉంటున్న రుపిందర్ నేటి నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ప్రారంభం కానున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆ దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2004లో జలంధర్‌కు దగ్గర్లోని పారస్‌రామ్ పుర్‌లో రుపిందర్ రెజ్లింగ్ పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ తరవాత రెండేళ్లకు టర్కీలో జరిగిన ఓ ఛాంపియన్‌షిప్‌లో ఆమె భారత్ తరఫున స్వర్ణ పతకం గెలుచుకున్నారు.

భారతీయ రెజ్లర్లయిన ‘ఫోగట్ సిస్టర్స్’ రుపిందర్‌కు చాలా దగ్గరి స్నేహితులు. రుపిందర్ పూర్తి శాకాహారి. ఆమెకు పదిహేను నెలల పాప కూడా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరి కచ్చులూరు పడవ ప్రమాదంలో ప్రధాన నిందితుడైన బోటు యజమాని, మరో ఇద్దరి అరెస్ట్

ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్

శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు?

నిర్మలా సీతారామన్: కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు... లాభాలతో ఉరకలెత్తిన సెన్సెక్స్

ఆంధ్రప్రదేశ్: గ్రామ స‌చివాల‌య ఉద్యోగ ప‌రీక్ష‌లపై వివాదం ఏంటి? ప్రభుత్వం ఏమంటోంది?

గోదావరి పడవ ప్ర‌మాదాలు: ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? ఫలితాలేమైనా ఉన్నాయా?

గూగుల్ యాప్స్ లేకుండా హువావే కొత్త ఫోన్లు.. మేట్ 30 ప్రోలో మూవీ కెమెరా

వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'