2018 కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం: భారతీయ బృందానికి పీవీ సింధు సారథ్యం

సింధు

ఫొటో సోర్స్, Getty Images

2018 కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరంలో బుధవారం నాడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత్ తరఫున బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జాతీయ పతాకాన్ని మోశారు. భారత ఆటగాళ్ల బృందం ఆమెను అనుసరిస్తూ స్టేడియంలోకి ప్రవేశించింది.

ఫొటో సోర్స్, Getty Images

క్రీడల ప్రారంభోత్సవానికి గోల్డ్ ‌కోస్ట్‌లోని కరారా స్టేడియం వేదికగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయీ మార్టిన్, డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ కమిల్లా, 2018 కామన్వెల్త్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ పీటర్ బీటీ, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, క్వీన్స్ లాండ్ ప్రీమియర్ అన్నాస్టేసియా పలాస్జక్, గోల్డ్ కోస్ట్ మేయర్ టామ్ టేట్‌లు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images

ఏప్రిల్ 4-15 మధ్య ఈ టోర్నమెంట్ జరగనుంది.

ఫొటో సోర్స్, Getty Images

71దేశాల నుంచి 6,600 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు. మొత్తం 18 క్రీడలు, 7 పారా స్పోర్ట్స్ ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా మహిళలు, పురుషులకు సమానమైన మెడల్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

మార్క్ నోల్స్ నేతృత్వంలో పోటీల ఆతిథ్య దేశమైన ఆస్ట్రేలియా క్రీడాకారుల బృందం కరారా స్టేడియంలో అడుగుపెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images

బీచ్ వాలీబాల్, పారా ట్రయథ్లాన్, విమెన్స్ రగ్బీ సెవెన్స్ క్రీడాంశాలను తొలిసారిగా ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రవేశపెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)