మార్టిన్ లూథర్ కింగ్: ‘నాకో కల ఉంది’ అంటూ నల్ల జాతీయుల చరిత్రను తిరగరాసిన నాయకుడు

మార్టిన్ లూథర్ కింగ్: ‘నాకో కల ఉంది’ అంటూ నల్ల జాతీయుల చరిత్రను తిరగరాసిన నాయకుడు

ఐ హేవ్ ఎ డ్రీమ్(నాకో కల ఉంది) అంటూ 1963లో అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్(జూనియర్) చేసిన ప్రసంగాన్ని చాలామంది వినే ఉంటారు.

ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని కదిలించిన, అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని మలుపుతిప్పిన ప్రసంగం.

ఆఫ్రికన్- అమెరికన్ అయిన లూథర్ కింగ్ అమెరికాలో నల్లజాతీయుల పట్ల వర్ణవివక్ష ఎంతగా ఉందో బాల్యం నుంచే స్వయంగా అనుభవించారు.

ఓ రోజు తెల్లజాతీయుడికి బస్సులో సీటు ఇవ్వలేదన్న కారణంతో ఆఫ్రికన్- అమెరికన్ మహిళను అరెస్టు చేశారు.

దానికి స్పందించిన లూథర్ కింగ్, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం ప్రారంభించారు. అమెరికా ప్రభుత్వం దిగివచ్చి చట్టాన్ని తీసుకొచ్చేలా చేశారు.

చివరికి ఆయన్ను హత్య చేశారు. ఆ హత్య జరిగి 2018 ఏప్రిల్ 4 నాటికి యాభై ఏళ్లు.

ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో ఈ వీడియో.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)