కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం సాధించిన గురురాజా

పి. గురురాజా

ఫొటో సోర్స్, MIB

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో తొలి రోజునే భారత్ బోణీ చేసింది.

కర్ణాటకకు చెందిన పి. గురురాజా వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించారు.

56 కిలోల విభాగంలో పోటీ పడిన గురురాజా మొత్తం 249 కిలోల బరువెత్తి ఈ మెడల్ గెల్చుకున్నారు.

కర్ణాటకలోని కుందాపూర్ పట్టణానికి చెందిన 25 ఏళ్ల గురురాజా తండ్రి ఓ ట్రక్ డ్రైవర్. ఎనిమిది మంది అన్నాదమ్ముల్లో ఆయన ఐదోవాడు.

దక్షిణ కర్ణాటకలో 2010లో డిగ్రీ చదివే సమయంలో ఆయన వెయిట్ లిఫ్టింగ్ ప్రారంభించాడు.

అంతకు ముందు 2016లో జరిగిన కామన్‌వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్‌ పోటీల్లో ఆయన స్వర్ణం సాధించాడు.

గువాహటీలో 2016లో జరిగిన 12వ దక్షిణాసియా క్రీడల్లోనూ ఆయన బంగారు పతకం సాధించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)