కామన్వెల్త్ క్రీడల్లో పాకిస్తాన్‌ను ఓడించిన తెలుగు క్రీడాకారులు

కిదాంబి శ్రీకాంత్

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన క్రీడాకారులు దూసుకెళ్తున్నారు.

గురువారం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన బ్యాడ్మింటన్ గ్రూపు-ఎ మ్యాచ్‌ల్లో సత్తా చాటారు.

ఐదు మ్యాచ్‌లలో ఏ ఒక్క సెట్‌లోనూ పాకిస్తాన్ గెలుపొందలేదు. అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ 2-0 తేడాతో విజయం సాధించింది.

శ్రీకాంత్

పురుషు సింగిల్స్‌ గ్రూప్ ఎ మ్యాచ్‌లో 2-0 తేడాతో పాకిస్తాన్‌ ఆటగాడు మురాద్ అలీపై కిదాంబి శ్రీకాంత్ గెలుపొందారు.

తొలి సెట్‌లో శ్రీకాంత్ 21 పాయింట్లు, మురాద్ అలీ 16 పాయింట్లు సాధించారు.

రెండో సెట్‌లో శ్రీకాంత్ 22 పాయింట్లు, మురాద్ అలీ 20 పాయింట్లు రాబట్టారు.

సైనా నెహ్వాల్

మహిళల సింగిల్స్‌లో పాకిస్తాన్ క్రీడాకారిణి మహూర్ షాహ్‌జాద్‌ను 2-0 తేడాతో సైనా నెహ్వాల్ ఓడించారు.

మొదటి సెట్‌లో సైనా 21 పాయింట్లు సాధించగా, మహూర్ 7 పాయింట్లు మాత్రమే రాబట్టారు.

రెండో సెట్‌లో సైనాకు 21 పాయింట్లు రాగా, మహూర్‌కి 11 పాయింట్లు వచ్చాయి.

మిక్స్‌డ్ డబుల్స్

పాకిస్తాన్‌కు చెందిన ఇర్ఫాన్ సయీద్ భట్టి, పల్వాశా బషీర్‌ల జోడీపై 2-0 తేడాతో రంకిరెడ్డి సాత్విక్, సిక్కీ రెడ్డీల జోడీ విజయం సాధించింది.

రెండు సెట్లలో భారత జట్టు 21 చొప్పున సాధించింది.

పాకిస్థాన్ జట్టు తొలి సెట్‌లో 10 పాయింట్లు, రెండో సెట్‌లో 13 పాయింట్లు మాత్రమే సాధించింది.

పురుషుల డబుల్స్

పాకిస్తాన్‌కు చెందిన ఇర్ఫాన్ సయీద్ భట్టి, మురాద్ అలీ జోడీని 2-0తేడాతో ప్రణవ్ చోప్రా, చిరాగ్ శెట్టీల జోడీ ఓడించింది.

పాకిస్తాన్ జట్టు తొలి సెట్‌లో 9 పాయింట్లు, రెండో సెట్‌లో 15 పాయింట్లు సాధించగా.. భారత జట్టు రెండు సెట్లలోనూ 21 పాయింట్ల చొప్పున రాబట్టింది.

మహిళల డబుల్స్

పాకిస్తాన్‌కు చెందిన మహూర్ షాహ్‌జాద్, పల్వాషా బషీర్ జోడీని 2-0 తేడాతో భారత్‌కు చెందిన అశ్వినీ పొన్నప్ప, గద్దె రుత్వికల జోడీ ఓడించింది.

రెండు సెట్లలోనూ భారత్ 21 పాయింట్ల చొప్పున సాధించింది.

తొలిసెట్‌లో పాకిస్తాన్ 6 పాయింట్లు, రెండో సెట్‌లో 10 పాయింట్లు మాత్రమే సాధించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)