ట్రంప్ టవర్స్‌లో మంటలు - ఒకరి మృతి

  • 8 ఏప్రిల్ 2018
ట్రంప్ టవర్‌లో మంటలు Image copyright Reuters

న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో 50వ అంతస్తులో మంటలు రావడాన్ని గమనించారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో.. నలుగురు ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి.

అయితే.. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారని తెలియక ముందు ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ ట్వటర్‌లో స్పందించారు.

'ఈ భవనాన్ని చాలా పటిష్టంగా నిర్మించాం.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన అధికారులకు ధన్యవాదాలు' అని ట్రంప్ ట్వీట్ చేశారు.

Image copyright Reuters

డొనాల్డ్ ట్రంప్ నివాసం, వ్యక్తిగత కార్యాలయం ఈ భవనంలోనే ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ట్రంప్, ఆయన భార్య, కుమారుడు వాషింగ్టన్‌లో సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకోవడంతో మంటలార్పడం చాలా కష్టమైందని అగ్నిమాపక శాఖ కమిషనర్ అన్నారు.

200 మంది ఫైర్, వైద్య సిబ్బంది సంఘటనా స్థలంలో విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి.. జరిగే నష్టమేంటి

ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్ట్.. నాలుగేళ్ల కిందటి కేసులో అదుపులోకి తీసుకున్న గజ్వేల్ పోలీసులు

అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?

కీటకాలు అంతరిస్తున్నాయి.. అవి లేకపోతే మనిషి కూడా బతకలేడు

ఎవరి శవపేటికను వాళ్లే ఎందుకు తయారు చేసుకుంటున్నారు

ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?

CAA: కేరళ దారిలో పంజాబ్... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం

ఆస్ట్రేలియా కార్చిచ్చు: కంగారూల ద్వీపాన్ని కమ్మేసిన మంటలు

IndVsAus: రాజ్‌కోట్ వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ సూపర్ హిట్... మూడు సెంచరీలు మిస్