కామన్‌‌వెల్త్ క్రీడలు: ఇద్దరు భారత క్రీడాకారుల సస్పెన్షన్.. ఇంటికి పంపిన అధికారులు

  • 13 ఏప్రిల్ 2018
తొడి, బాబు Image copyright Getty/Reuters

సిరంజిలపై నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారంటూ ఇద్దరు భారతీయ క్రీడాకారుల్ని కామన్‌వెల్త్ క్రీడల అధికారులు స్వదేశానికి పంపించారు.

జంపింగ్ క్రీడాకారుడు రాకేశ్ బాబు, నడక పోటీల్లో పాల్గొనే ఇర్ఫాన్ కొలోతుమ్ తొడిల అక్రెడిటేషన్‌ను కామన్‌వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) ఉపసంహరించుకుంది. తక్షణం అందుబాటులో ఉన్న విమానం ఎక్కి స్వదేశానికి వెళ్లిపోవాలని వారిద్దరికీ అధికారులు సూచించారు.

వీరు నివశిస్తున్న అపార్ట్‌మెంట్ వద్ద సిరంజిలు లభించాయి.

వీరి గదిలోని టేబుల్ పక్కన ఒక కప్పులో సిరంజి లభించిందని గదిని శుభ్రం చేసే పనివారు చెప్పగా.. ఆస్ట్రేలియా యాంటీ డోపింగ్ అధికారి ఒకరు బాబు బ్యాగులో మరొక సిరంజిని కనుగొన్నారు.

దీనిపై విచారణ జరుపగా క్రీడాకారులు ఇద్దరూ ‘నమ్మేందుకు వీలులేని, పొంతనలేని’ సమాధానాలు ఇచ్చారని కామన్‌వెల్త్ క్రీడల సమాఖ్య అధ్యక్షుడు లూయిస్ మార్టిన్ శుక్రవారం చెప్పారు.

ఇలాంటి వాటిని కామన్‌వెల్త్ క్రీడల సమాఖ్య ఉపేక్షించబోదని, ‘ఆ ఇద్దరు క్రీడాకారుల్ని సస్పెండ్ చేశాం. వారు క్రీడల నుంచి వైదొలిగారు’ అని వెల్లడించారు.

అసలు ఈ సిరంజిల సంగతేమీ తమకు తెలియదని క్రీడాకారులు చెప్పారు.

డోపింగ్‌ పరీక్షల్లో భారత జట్టు నెగ్గింది. అయితే, అనారోగ్యంతో ఉన్న ఒక బాక్సర్‌కు ఏప్రిల్ 3వ తేదీన విటమిన్ ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత అక్రమంగా సిరంజిలు వాడారని భారత జట్టును అధికారులు తీవ్రంగా మందలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)