పాములూ తేళ్లతో స్నేహం.. అదే అత్యుత్తమ ఉద్యోగం!

  • 17 ఏప్రిల్ 2018
పాము

యూకేకి చెందిన కెవిన్ అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో పెస్ట్ కంట్రోలర్‌గా సేవలందిస్తున్నారు. అక్కడి ఎయిర్‌బేస్‌లో ఉన్న తమ సైన్యానికి విష కీటకాలు, జంతువుల నుంచి రక్షణ కల్పించడమే ఆయన పని.

ఆ పని ఎంత సాహసంతో నిండిందో తెలియాలంటే వీడియో చూడండి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపాములూ తేళ్లతో స్నేహం.. ప్రపంచంలో అదే అత్యుత్తమ ఉద్యోగం!

అఫ్గానిస్థాన్‌లో దశాబ్దాలుగా జరుగుతున్న అంతర్యుద్ధం అనేక అవాంఛనీయ పరిణామాలకు దారితీసింది. యుద్ధ ప్రభావానికి లోనైన చాలా ప్రాంతాలను వదిలి ప్రజలు దూరంగా వెళ్లిపోయారు. దాంతో అక్కడ జంతువుల సంచారం పెరిగిపోయింది.

ఆ పెరిగిపోయిన జంతువులు, విష కీటకాలు, సర్పాలు, తేళ్లు తదితర జీవులు అక్కడి సైన్యంపై దాడి చేస్తున్నాయి.

ఆ పరిణామాలను నివారించడానికి, జంతువులను నియంత్రించడానికి కెవిన్ తమ దేశ సైన్యం కోసం అఫ్గానిస్థాన్‌లో పనిచేస్తున్నారు.

ఆ పనిలో భాగంగా ఆయన నిత్యం అత్యంత ప్రమాదకర జీవులను పట్టుకుంటుంటారు. కానీ వాటిని చంపకుండా తిరిగి అడవిలో వదిలేస్తారు.

సాహసంతో కూడిన ఆ వృత్తే ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన పని అని కెవిన్ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు