ఉత్తర కొరియా: ప్రజల కూలి డబ్బుతో ప్రభుత్వ పాలన

  • 18 ఏప్రిల్ 2018
కిమ్ జోంగ్ ఉన్ Image copyright Getty Images

సాధారణంగా ప్రజల నుంచి ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంది. కానీ ఉత్తర కొరియా మాత్రం తమ ప్రజలను ఇతర దేశాలకు కూలికి పంపి, ఆ డబ్బునే సుంకంగా వసూలు చేస్తోంది.

ఆ డబ్బుని ప్రభుత్వ పాలన కోసం ఉపయోగిస్తోంది.

దాదాపు 1.5లక్షల మంది అక్కడ బలవంతపు బానిసల్లా మారారు. వాళ్లంతా పోలండ్, రష్యా, చైనా లాంటి దేశాలకు వెళ్లి, అక్కడ కార్మికుల్లా పనిచేస్తూ వచ్చిన డబ్బు స్వదేశానికి పంపిస్తున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఉత్తర కొరియా: ప్రజల కూలి డబ్బుతో ప్రభుత్వ పాలన

‘ఇక్కడ మమ్మల్ని కుక్కల్లా చూస్తారు. నానా చెత్తా తిని బతకాలి. మనిషిలా బతకడం మరచిపోవాలి’ అని ఓ వ్యక్తి బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

వీళ్లు సంపాదించి పంపిన డబ్బుని 'పార్టీ సుంకం' లేదా 'విప్లవ సుంకం' అని పిలుస్తారు. వీళ్లంతా కలిసి కిమ్ ప్రభుత్వం కోసం ఏటా బిలియన్ డాలర్లకు పైగా పంపిస్తున్నారు.

‘మేం సెలవుపెడితే డబ్బులివ్వరు. ఒక్కోసారి లక్ష్యాన్ని పూర్తిచేయడం కోసం రోజుల తరబడి విరామం లేకుండా పనిచేస్తాం’ అని పోలాండ్‌లో పనిచేస్తున్న ఉత్తర కొరియా కార్మికుడు చెప్పారు.

అంతర్జాతీయంగా విధించిన ఆంక్షల వల్ల ఉత్తర కొరియాలో కరెన్సీ కొరత ఏర్పడింది. ఉత్తర కొరియా వ్యక్తులను విదేశాల్లో పనికి ఉపయోగించకుండా చేసేందుకు ఐరాస చర్యలు తీసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)