వ్యక్తిత్వానికి.. పర్‌ఫ్యూమ్‌కు సంబంధం ఉందా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వ్యక్తిత్వానికి.. అత్తర్లకు సంబంధం ఉందా?

  • 20 ఏప్రిల్ 2018

మనిషి చేసే ప్రతిపని అతని వ్యక్తిత్వాన్ని పట్టి చూపుతుంది.

మనిషి వ్యక్తిత్వానికి, అతను మెచ్చే సువాసనకు మధ్య చాలా లోతైన సంబంధం ఉంది. మనిషి పుట్టినప్పుడు మెదడులోని వాసన గుర్తించే భాగం ఖాళీగా ఉంటుంది. పెరిగే క్రమంలో రకరకాల వాసనలను అది రికార్డు చేస్తుంది.

ధరించే దుస్తులైనా, వాటిపై చల్లుకునే పరిమళభరిత అత్తరులయినా.. దేహం నుంచి వచ్చే ప్రతి సువాసనకు ఒక భాష ఉంటుందంటున్నారు బ్రిటన్‌కు చెందిన రోజా డోవ్.

ఒకేసారి 800 రకాల సువాసనలను ఆయన గుర్తించగలరు.

ప్రపంచంలోనే అతి ఖరీదైన పరిమళ ద్రవ్యాలను విక్రయిస్తుంటారు రోజా డోవ్. వీటిలో తిమింగలం నుంచి సేకరించిన కొవ్వుతో తయారు చేసే అత్తర్లు కూడా ఉంటాయి. వీటి ధర రూ.23 లక్షలకు పైమాటే.

బ్రిటన్‌లో సువాసన పరిమళాల పరిశ్రమ పరిమాణం 180 కోట్ల డాలర్లు. ఈ రంగం కార్ల పరిశ్రమ కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. కానీ, ఇక్కడ అత్తర్లు తయారు చేసే వారికంటే అంతరిక్ష యాత్రికులే ఎక్కువ.

మనుషుల వ్యక్తిత్వాలకు తగినట్లుగా ఖరీదైన అత్తర్లను తయారు చేస్తున్న డోవ్‌పై బీబీసి ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు