ఆ గాయకుడు నన్ను లైంగికంగా వేధించాడు: ‘భాగ్ మిల్ఖా భాగ్’ నటి

  • 21 ఏప్రిల్ 2018
మీషా షఫీ Image copyright Meesha Shafi/FB

పాకిస్తాన్‌లో ప్రముఖ గాయకుడు అలీ జాఫర్ తనను లైంగికంగా వేధించాడంటూ టాప్ హీరోయిన్ ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

గాయకుడు అలీ జాఫర్ తనను శారీరకంగా వేధించారంటూ నటి మీషా షఫీ గురువారం ట్విటర్‌లో వెల్లడించారు.

జాఫర్ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.

పాకిస్తాన్‌లో అనేక మంది మహిళలు లైంగిక హింస ఎదుర్కొంటున్నారని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.

లైంగిక వేధింపులకు నిరసనగా #MeToo ఉద్యమంలో పాకిస్తాన్‌లో వెలుగులోకి వచ్చిన కేసు ఇదేనని భావిస్తున్నారు.

Image copyright GETTY IMAGES/AFP


మీషా షఫీ బాలీవుడ్ చిత్రం 'భాగ్ మిల్ఖా భాగ్'లో నటించారు. ఇంగ్లిష్‌ చిత్రం 'ది రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్'తో పాటు పలు సినిమాల్లో, టీవీ షోలలో నటించారు.

"ఒక మహిళగా కొన్ని సమస్యల గురించి, ముఖ్యంగా లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం చాలా కష్టం" అంటూ ఏడు పేరాల పత్రాన్ని ఆమె ట్వీట్ చేశారు.

అలీ జాఫర్ బాలీవుడ్‌లో గాయకుడిగా పలు అవార్డులు అందుకున్నారు.

"ఆమె చేసిన ఆరోపలను ఖండిస్తున్నాను. ఈ విషయంలో కోర్టుకు వెళ్లాలని అనుకుంటున్నాను. నాకు #MeToo ఉద్యమం గురించి అంతా తెలుసు. ఆ అంతర్జాతీయ ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నాను. నేను దాచాల్సింది ఏమీ లేదు" అని జాఫర్ అన్నారు.జాఫర్ తనను "పలుమార్లు వేధించారని, ఎంతో బాధను దిగమింగానని" మీషా అన్నారు.

"అతను చాలా ఏళ్లుగా తెలుసు. ఇద్దరం కలిసి ఒకే వేదికపై పనిచేశాం. కానీ, అతని ప్రవర్తన, తీరు ఏమాత్రం బాగాలేదు" అని ఆరోపించారు.

మీషా ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. షఫీ పేరు ట్రెండింగ్‌లో ఉంది.

చాలా మంది మహిళలు ఆమెకు మద్దతు పలుకుతున్నారు.ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)