నల్లవారికి అక్కడ ఇల్లే ఇవ్వరు.. ఈ అమ్మాయి మనసిచ్చేసింది

  • 24 ఏప్రిల్ 2018
హాంకాంగ్ జంట

‘నల్ల జాతీయులు క్రిమినల్స్ అని మా కుటుంబ సభ్యులు అనుకునేవారు. సినిమాలు, రియాల్టీ షోలు.. ఎక్కడ చూసినా ఒక్కటే మాట.. వాళ్లు డ్రగ్స్ అమ్ముతారు, మనుషుల్ని చంపుతారు, వాళ్లతో స్నేహం మంచిది కాదు అని’.. హాంకాంగ్‌లో ఉండే లూయీ అనే యువతి చెబుతున్న మాటలివి.

హాంకాంగ్‌లో చాలామంది నల్లజాతి శరణార్థులున్నారు. వాళ్లకు అక్కడ ఇల్లు అద్దెకు దొరకడం కష్టం. పని చేయడానికి కూడా అనుమతి లేదు. ప్రజల్లో వారిపై ప్రతికూల భావనే ఎక్కువ.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: శరణార్థులకు ఇల్లే ఇవ్వరు.. ఈ పిల్ల ఏకంగా మనసిచ్చేసింది

అలాంటిది లూయీ అనే యువతి, నల్లజాతీయుడైన సోలోమన్ అనే ఓ శరణార్థిని ప్రేమించింది. అక్కడితో ఆగకుండా, తమ కుటుంబంలో కూడా నల్లజాతీయులపై ఉండే వ్యతిరేకతను పోగొట్టడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నం ఫలించి, లూయీ తల్లి వాళ్లిద్దరి బంధానికీ ఓకే చెప్పారు.

‘ఇక్కడివాళ్లు కొన్ని పరిమితులు పెట్టుకున్నారు. తమ చుట్టూ ఓ కంచెను నిర్మించుకున్నారు. దాన్ని దాటి ముందుకెళ్లడం కష్టం’ అని డారియస్ అనే ఓ నల్లజాతీయుడు అంటున్నారు.

అలాంటి పరిస్థితుల్లో హాంకాంగ్ అమ్మాయి, ఆప్రికన్ అబ్బాయి ఎలా ప్రేమలో పడ్డారో, ఆ బంధాన్ని ఎలా నిలుపుకున్నారో తెలియాలంటే పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు