#BBCArchives వీడియో: తొలితరం విమాన ప్రయాణ ప్రయోగాలు ఇలా జరిగాయి
రెండు వారాల క్రితం ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్‌కు నాన్‌స్టాప్ విమాన ప్రయాణం మొట్టమొదటి సారిగా జరిగింది. క్వాంటాస్ విమానం QF9 దాని మొదటి 14,498 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. అది పెర్త్ నుంచి లండన్‌కు పదిహేడు గంటల్లోనే చేరుకుంది. ఒక శతాబ్ద కాలంలో ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్‌కు చేరుకునే ప్రయాణం, ఆరు వారాల సముద్రయానం నుంచి పదిహేడు గంటల విమాన ప్రయాణం వరకు పరిణామం చేరింది. ఈ సందర్భంగా, విమానయానంలో మొదటి దశ ప్రయాణ ప్రయోగాల అరుదైన దృశ్యాలను ఈ వీడియోలో చూడండి.. బీబీసీ ఆర్కైవ్స్ నుంచి..
రైట్ సోదరులు ఓర్విల్, విల్బర్, సొంతంగా తయారు చేసుకున్న విమానంలో గగనతలంలోకి ఎగిరిన మొట్టమొదటి వ్యక్తులు.
ఉత్తర కేరొలీనా లోని కిట్టి హాక్‌లో, 1903 డిసెంబర్ 17వ తేదీన ఓర్విల్ కేవలం 12 సెకన్ల పాటు 120 అడుగుల ఎత్తులో ప్రయాణం చేసి చరిత్ర సృష్టించాడు.
ఆరేళ్ళ తరువాత, మొదటి సారిగా లూయీస్ బ్లెరియోట్, గగనతలం మీదుగా ఇంగ్లీష్ చానెల్‌ను దాటారు.
అలానే 1912వ సంవత్సరం ఏప్రిల్ నెలలో, విమాన చోదకుడిగా, డెన్నిస్ కోర్బెట్ విల్సన్.. వేల్స్ నుంచి మొదలై ఐరిష్ సముద్రాన్ని దాటుతూ ఐర్లాండ్‌లో క్రాష్ ల్యాండింగ్ చేశారు.
1914లో ట్రిగ్వే గ్రాన్.. స్కాట్లాండ్లో మొదలై నార్త్ సీ మీదుగా మొదటిసారిగా నార్వే చేరుకున్నారు.
1919లో ఆర్థర్ విట్టెన్ బ్రౌన్, జాన్ ఆల్కాక్లు.. మొదటి ట్రాన్స్ అట్లాంటిక్ విమానయానం చేశారు. వారు కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి ఐర్లాండ్‌లోని క్లిఫ్డెన్కు దాదాపు 16 గంటలు ఆకాశ ప్రయాణం చేసి చేరుకున్నారు.
కొన్ని నెలల తరువాత రాస్, కీత్ మక్ఫెర్సన్లు.. లండన్ నుంచి ఆస్ట్రేలియాకు విమానయానంలో తమ వాటాను పెంచారు. ఆ దారిలో వారు పద్నాలుగు విమానాశ్రయాల్లో ఆగారు. డార్విన్ను చేరుకోవడానికి వారికి 135 గంటల సమయం పట్టింది.
1947వ సంవత్సరంలో చక్ యీగర్, శబ్ద తరంగాల వేగాన్ని చేధించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అది మేక్ 1 స్పీడుని సాధించడంతో సాధ్యమయింది. మేక్ స్పీడంటే.. గంటకు 1000 కిలోమీటర్లు ప్రయాణించడం.
ఆ తర్వాత 1969 లో కాంకర్డ్.. మొదటి సూపర్ సోనిక్ విమానంతో కొత్త చరిత్రకు నాంది పలికారు.
మరో ముందడుగు, 1976కి గానీ సాధ్యం కాలేదు. అదే మేక్ 2 స్పీడుని అందుకోవడం. అంటే గంటకు 2179 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం.
అయితే, 2003లో సూపర్ సోనిక్ శకానికి తెర పడింది. విమానాలు అత్యంత ఎత్తులో ప్రయాణించే దిశగా సాగాయి. ఇంధన సామర్ద్యాలు పెరగడంతో, పెర్త్ నుంచి లండన్ వరకు నిర్విరామ విమాన ప్రయాణం సాధ్యమయింది. అదికూడా మధ్యలో తిరిగి ఇంధనాన్ని నింపకుండా దాదాపు పద్నాలగు వేల ఐదువందల కిలోమీటర్లను పదిహేడు గంటల్లోనే చేరుకోగలిగారు.
ఇవి కూడా చూడండి:
- మేడ మీదే విమానం తయారీ
- విమానాల్లో వీల్ చైర్ల కోసం ఓ తల్లి ఉద్యమం
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
- విమానానికి బంగారపు ఎస్కలేటర్.. రాజు దిగుతుండగా ఆగిపోయింది
- హైపర్సోనిక్ ప్యాసింజర్ విమానాన్ని తయారు చేస్తున్న చైనా. ఎందుకు?
- పైలట్లకు ఇంగ్లిష్ రాకపోవడమే విమాన ప్రమాదాలకు కారణమా?
- అవని చతుర్వేది: యుద్ధ విమానం ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళ
- ఆసియాలో విమానయానాన్ని ఎవరు శాసిస్తున్నారు?
- ఎయిర్ ఇండియా: ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు - మంచివీ, చెడ్డవీ
- బోయింగ్ 777 పిన్న పైలెట్.. బెజవాడ అమ్మాయే
- హజ్ సబ్సిడీ నిజంగా ముస్లింలకా, విమానయాన కంపెనీలకా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)