వియత్నాంలో నోరూరించే స్ట్రీట్ ఫుడ్స్ ఇవే!

మీరు వియత్నాం అంతా తిరిగారంటే ఒక్క విషయం మిమ్మల్ని తప్పక ఆకర్షిస్తుంది. అక్కడి ప్రజలు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు.

ఊబకాయం అన్న సమస్యే కనపడదు. వారి ఆహారపు అలవాట్లలో ప్రధానమైనది కప్పు నిండా నూడిల్స్ సూప్‌ని తాగటం. మా బీబీసీ ప్రతినిధి జుబైర్ అహ్మద్, వియత్నాం లోని హనోయ్ నగరంలో స్ట్రీట్ ఫుడ్ రుచులలో మునిగి తేలుతూ అందిస్తున్న కథనం.

హనోయ్‌లోని సాయంత్రాలు చాలా ఆహ్లాదకరంగా, రద్దీగా ఉంటాయి. అందుకు కారణం, అక్కడి ప్రత్యేకమైన స్ట్రీట్ ఫుడ్.

చాలా ప్రత్యేకమైన వంటకాలు ఇక్కడ దొరుకుతాయి. గొడ్డు మాంసం, పంది మాంసం, కోడి మాంసం ఇక్కడ చాలా సాధారణం.

సముద్రపు ఆహారం కూడా చాలా పాపులర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)