వియత్నాం హిందువులు : ఒకప్పుడు రాజ్యాలు ఏలారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు

వియత్నాంలోని ఒక హిందూ దేవాలయం

కొన్ని శతాబ్దాల పాటు హిందూ సంస్కృతి సంప్రదాయాలు రాజ్యమేలిన దేశం వియత్నాం. అత్యుత్తమ శిల్పకళతో కూడిన ప్రాచీన ఆలయాల నిలయం. అయితే అదంతా గతం.

ఇప్పుడు అక్కడి హిందూ మైనార్టీలు కనుమరుగవుతున్నతమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి జుబైర్ అహ్ద్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

మధ్య వియత్నాం ప్రాంతమంతా ఒకప్పుడు హిందూ రాజ్యం. అంతేకాదు, ఇది హిందూ మతానికి పెట్టని కోటగా వర్థిల్లింది. స్థానిక చమ్ తెగ ఘనమైన హిందూ సంప్రదాయానికి ప్రతీకలా నిలిచింది.

ఒకప్పుడు హిందు మతం ఇక్కడ పరిఢవిల్లిందనడానికి ఇక్కడున్న పురాతన ఆలయాలే సాక్ష్యాలు. హిందూ మతానికి చెందిన చమ్ తెగవారు క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి 18వ శాతాబ్దం వరకు పాలన సాగించారు.

వీడియో క్యాప్షన్,

వీడియో: వియత్నాంలో వేల ఏళ్ళ చరిత్ర కలిగిన హిందువులు

ఆ తర్వాత చాలా మంది బౌద్ధం, ఇస్లాం మతాల్లోకి మారిపోయారు. ఫలితంగా ఇప్పుడు అక్కడ ఆ మతానికి చెందిన వారి సంఖ్య చాలా తక్కువైపోయింది. చమ్ తెగ నివసించే ఓ గ్రామానికి బీబీసీ వెళ్లింది.

ఇన్రా జకా, ఆయన తండ్రి ఇన్రా సరా
ఫొటో క్యాప్షన్,

ఇన్రా జకా, ఆయన తండ్రి ఇన్రా సరా

‘‘మేం మా తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాల నుంచి రాళ్లను పూజించడం గురించి విన్నాం. ఆ రాళ్లు లింగాకారంలో ఉంటాయి. శివుడు మా ఆరాధ్య దైవం’’ అని ఇన్రా జకా అనే ఒక హిందూ యువకుడు తెలిపారు.

ఇన్రా జకా, ఆయన తండ్రి ఇన్రా సరాలు.. హిందూ మతం అందించిన సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 70 వేల మంది మాత్రమే హిందువులున్నారు.

నాలుగు ఆలయాలు ఉపయోగంలో ఉన్నాయి. రెండింటికి భక్తుల్ని కూడా అనుమతిస్తారు. ప్రస్తుతం ఇక్కడ హిందూ మతం అంతరించిపోయే దశలో ఉంది.

‘‘మా మతంలో ఎలాంటి పవిత్ర గ్రంధాలు లేవు. అవన్నీ చరిత్రలో కలిసిపోయాయని చెప్పొచ్చు. ఈ తరానికి హిందూ సంస్కతికి గురించి పెద్దగా తెలియదు’’ అని ఇన్రా జకా చెప్పారు.

వియత్నాంలోని ఒక హిందూ దేవాలయం
ఫొటో క్యాప్షన్,

వియత్నాంలో ఇప్పుడు 70 వేల మంది మాత్రమే హిందువులున్నారు

ప్రాచీన కాలంలో దక్షిణ వియత్నాంలోని చాలా నగరాల్లో హిందువులు నివసించేవారు. 18వ శతాబ్దానికి చెందిన ఒక ఆలయానికి ధర్మకర్తగా ఉన్న ముతయ్యకు అటు భారత్‌తోనూ ఇటు వియత్నాంతోనూ సంబంధ బాంధవ్యాలున్నాయి. ఆయన పూర్వీకులు తమిళనాడు నుంచి ఇక్కడకి వచ్చి స్థిరపడ్డారు.

‘‘భగవంతునికి పూజలు ఎలా చెయ్యాలో మా నాన్న నాకు నేర్పించారు. నాకు వేదాలు తెలుసు. ఆలయానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసు’’ అని ముతయ్య చెప్పారు.

ఈ నగరంలో భారతీయ హిందువులు పూజలు నిర్వహించే మరో రెండు ఆలయాలున్నాయి. వారికి చమ్ హిందువుల గురించి, వాళ్ల గుళ్లు, గోపురాల గురించి తెలుసు. అయితే చమ్ తెగకు చెందిన ప్రాచీన సంస్కృతిని సంప్రదాయాలను కాపాడటంలో వాళ్ల సాయం పెద్దగా ఉండదు.

చమ్ తెగ తమ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు ఈ అతి పురాతన హిందూ తెగ అంతరించిపోయే దశలో ఉంటే.. అటు ఆ మతానికి చెందిన పురాతన ఆలయ అవశేషాలు మాత్రం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

వియత్నాంలోని ఒక హిందూ దేవాలయం
వియత్నాంలోని ఒక హిందూ దేవాలయం
వియత్నాంలోని ఒక హిందూ దేవాలయం
1880ల్లో తమిళులు నిర్మించిన మురుగన్ ఆలయం
ఫొటో క్యాప్షన్,

హో చీ మిన్ నగరంలో 1880ల్లో తమిళులు నిర్మించిన మురుగన్ ఆలయం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)