చైనా: అడ్డదిడ్డంగా రోడ్డు దాటితే.. నీరు పడుద్ది జాగ్రత్త!!

  • 2 మే 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: అడ్డదిడ్డంగా రోడ్డు దాటితే.. నీరు పడుద్ది

'సిగ్నల్‌ను పట్టించుకోకుండా ఎలా పడితే అలా రోడ్డు దాటాలని ప్రయత్నిస్తే నీరు పడుద్ది జాగ్రత్త' అని చైనా ప్రభుత్వం ప్రజల్ని హెచ్చరిస్తోంది.

రెడ్‌ సిగ్నల్ పడినప్పుడు ప్రజలు రోడ్డు దాటి ప్రమాదాలకు గురికాకుండా చైనా ప్రభుత్వం ఓ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఎవరైనా రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తే వాళ్లపైన నీళ్లు పడేలా ఏర్పాటు చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు దాటేవారిని మోషన్ సెన్సార్ల ఆధారంగా గుర్తించి ఆ వ్యవస్థ నీటిని వెదజల్లుతుంది. అడ్డదిడ్డంగా రోడ్డు దాటేవారి ఫొటోలను కూడా చాంగ్జీ ప్రావిన్స్‌లో పెద్ద తెరలపై ప్రసారం చేస్తారు.

ప్రజలు నిబంధనలను ఉల్లంఘించకుండా చేసేందుకే ఈ ప్రయత్నం అని చైనా అంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)