లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#BBCArchives: అమ్మకానికి లండన్ బ్రిడ్జి.. ధర 2.4 మిలియన్ డాలర్లు

  • 1 మే 2018

యాభైయ్యేళ్ళ క్రితం, లండన్ బ్రిడ్జిని అమ్మకానికి పెట్టారు. అది ఒక అమెరికా ధనవంతుణ్ని అమితానందానికి గురిచేసింది. ఆయన, లండన్ బ్రిడ్జిని అమెరికాలోని అరిజోనా తరలించాలనుకున్నారు. ఆ బ్రిడ్జి ఎలా సముద్రాలు దాటి పోయిందో బీబీసీ ఆర్కైవ్స్ నుంచి ప్రత్యేకంగా.

నర్సరీ పిల్లలకు ముద్దుగా ఆడుతూ పాడుతూ నేర్పించే పాపులర్ ఇంగ్లీష్ పద్యం లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్.

కానీ నిజానికి, లండన్ బ్రిడ్జ్ కిందకు పడిపోవట్లేదు. ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వలన మెల్లగా థేమ్స్ నదిలో మునుగుతోంది.

అందుకే 1960లో ఈ పాత వంతెనను అమ్మి, కొత్త బ్రిడ్జిని కట్టాలనుకున్నారు.

దాన్ని అపురూపంగా కాపాడుకోవాలంటే బ్రిడ్జి మొత్తాన్నీ అమ్మాల్సిందే. అయితే అదే సమయంలో కొత్తగా నిర్మించే బ్రిడ్జికి అవసరమయ్యే రాయిని మళ్లీ కొనడం కన్నా పాత బ్రిడ్జి నుంచే వాడుకోవడం మంచిదని భావించారు.

మొత్తానికి పాత వంతెనను కొనుక్కునేందుకు అమెరికన్ వ్యాపార వేత్త రాబర్ట్ పీ మెకుల్లాక్ ముందుకొచ్చారు. 1968లో లండన్ బ్రిడ్జిని 2.4 మిలియన్ డాలర్లకు కొన్నారు.

నిజానికి ఈ పాత వంతెనను 1831లో నాల్గవ విలియం ప్రారంభించారు. 1968లో అమ్మేసిన తర్వాత ఒక్కో ఇటుకను విడగొట్టి అమెరికాకు తరలించారు.

ఆ పురాతన వంతెనను ఎడారి ప్రాంతంలో పునర్నిర్మించారు. అక్కడ ఎడారి లాంటి ప్రాంతంలో ఇళ్లు కొనుక్కున్న వారికి ఈ వారధి అభివృద్ధికి సంకేతంగా నిలిచింది.

ఒకవేళ ఈ పాత బ్రిడ్జిని కొనడం ఏంటి, సముద్రయానం ద్వారా అమెరికాకు తరలించి.. ఇంత ఖర్చు చేసి, అదికూడా ఒక ఎడారి ప్రాంతంలో పునర్నిర్మించడమేంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీ మాటలు వింటే దీనిని కొనుగోలు చేసిన మెకుల్లాక్ కార్పొరేషన్ డైరెక్టర్లు పడి పడి నవ్వక మానరు.

ఎందుకంటే, రియల్ ఎస్టేట్ ద్వారా వారు ఈ బ్రిడ్జి కోసం పెట్టిన ఖర్చుకి మూడింతల లాభాలు సొమ్ము చేసుకున్నారు. అది వారి నూతన నగర అభివృద్ధి ప్రణాళికలో భాగం.

లండన్‌లో నూతన బ్రిడ్జిని 1973లో రెండవ రాణి ఎలిజబెత్ ప్రారంభించారు.

అందుకే ఎప్పుడైనా లండన్ బ్రిడ్జి అనే పదం వినపడగానే, దానికి రెండు నగరాల కథ ఉందని అర్ధం చేసుకోవాలి.

మా ఇతర కథనాలను చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు