ఒకప్పడు శత్రువులు. నేడు శాంతి కోసం ఒక్కటవుతున్నారు.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#CrossingDivides: ఒకప్పటి శత్రువులు.. శాంతి కోసం నేడు ఒక్కటవుతున్నారు!

  • 2 మే 2018

1975 నుంచి 15 ఏళ్ల పాటు అంతర్యుద్ధంతో చితికిపోయిన మధ్య ప్రాచ్యంలోని అతి చిన్న దేశం లెబనాన్‌లో మళ్లీ అవే కష్టాలు తలెత్తకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయా?

మాజీ పోరాట యోధులతో కూడిన 'ఫైటర్స్ ఫర్ పీస్' సంస్థ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వివిధ మతాలకు చెందిన వారంతా ఆ సంస్థలో సభ్యులే.

చిన్న చిన్నసందేశాత్మక నాటికలు, వర్క్ షాపుల ద్వారా స్థానికుల్లో చైతన్యాన్ని కల్గిస్తున్నారు. ముక్కలైపోతున్న సమాజాన్ని ఒక్కటి చేసే ఉద్దేశంతో పని చేస్తున్న వ్యక్తులు, సంస్థల విశేషాలను 'కంచెలు దాటి' అనే శీర్షికతో వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం. ఈ సిరిస్‌లో లెబనాన్ నుంచి బీబీసీ అందిస్తున్న తొలి కథనం ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)