అరుణకంపం రహస్యాలపై 'నాసా ఇన్‌సైట్‌'

  • 5 మే 2018
ఇన్‌సైట్ మిషన్ Image copyright NASA

అంగారకుడి పైకి నాసా 'ఇన్‌సైట్' మిషన్ ప్రయోగించింది. రెడ్‌ప్లానెట్‌ అంతర్భాగం ఎలా ఉంటుందన్న అంశంపై ఇది శోధిస్తుంది.

నాసా ప్రయోగించిన ఇన్‌సైట్‌ మిషన్ అంగారకుడి అంతర్భాగంపై అధ్యయనం చేస్తుంది.

అంగారకుడిపై ప్రకంపనలు, నేల స్వరూపం, భూమితో ఉన్న సారూప్యాలను ఇది విశ్లేషిస్తుంది.

ప్రకంపనలను అధ్యయనం చేయడం ద్వారా అంగారకుడి అంతర్భాగంలో రాతి పొరల అమరిక ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

ఆ వివరాలను భూఅంతర్భాగానికి సంబంధించిన సమాచారంతో పోల్చి చూస్తారు.

అంగారకుడు, భూమి ఎలా ఆవిర్భవించాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

4.6 బిలియన్ సంవత్సరాల క్రితం గ్రహాల ఆవిర్భావం ఎలా జరిగిందో కనిపెట్టేందుకు కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించుకుంటారు."అరుణ కంపం తరంగాలు వివిధ శిలల మధ్య నుంచి ప్రయాణిస్తాయి.అలా ప్రయాణిస్తున్న సమయంలో అంగారకుడి అంతర్భాగంలోని శిలలకు సంబంధించిన వివరాలు అవి సేకరిస్తాయి" అని ఇన్‌సైట్‌ మిషన్ ప్రధాన పరిశోధకుడు డాక్టర్ బ్రూస్ బానెర్డ్ చెప్పారు.

అంగారకుడిపై అనేక దిశల నుంచి వచ్చిన ప్రకంపనలను క్రోడీకరించి, విశ్లేషించి రెడ్ ప్లానెట్ అంతర్భాగం ఎలా ఉంటుందో తెలిపే త్రీడీ చిత్రాన్ని శాస్త్రవేత్తలు తయారు చేస్తారు.అంగారకుడిపై రాతి శిలలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఈ మిషన్ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇన్‌సైట్ మిషన్‌ అంతరిక్షంలో ఆరు నెలల ప్రయాణించి అంగారకుడిని చేరుతుంది.

ఇన్‌సైట్ రోబో చేయి అంగారకుడిపై 10 నుంచి 16 అడుగుల లోతు వరకు రంధ్రం చేయగలదు.

గతంలో ప్రయోగించిన మార్టిన్ మిషన్ కంటే ఇది 15 రెట్లు అధికం.అరుణ కంపాలను కనిపెట్టే పరికరాలను 1970లో నాసా వికింగ్ లాండర్‌లో అంగారకుడిపైకి పంపింది. కానీ ప్రకంపనలను గుర్తించడంలో ఈ మిషన్ విఫలమైంది.

తాజాగా ఇన్‌సైట్ మిషన్‌లో మరోసారి సెస్మోమీటర్లను పంపిస్తోంది.ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.