అఫ్గానిస్తాన్‌లో ఆరుగురు భారతీయుల కిడ్నాప్

  • 6 మే 2018
ప్రతీకాత్మక చిత్రం Image copyright zabelin
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

అఫ్గానిస్తాన్‌లో పని చేస్తున్న ఆరుగురు భారతీయులు కిడ్నాప్‌కి గురయ్యారు. వీరు భాగ్లాన్ ప్రావిన్స్‌లో ఓ విద్యుత్తు ప్లాంట్‌ వద్ద పని చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

ఈ ఇంజనీర్లు ప్రభుత్వ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం వద్దకు మినీ బస్సులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో బెదిరించి వీరిని అపహరించారని భాగ్లాన్ పోలీసు అధికార ప్రతినిధి జబిహుల్లా షుజా తెలిపారు.

అప్గానిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఈ ఇంజినీర్లంతా డ అఫ్గానిస్తాన్ బ్రెష్ణా షెర్కాట్‌లో పని చేస్తున్నారని వివరించారు.

ఈ విద్యుత్తు ప్లాంట్, ఇతర భారీ నిర్మాణాల వద్ద 150 మంది భారతీయులు పని చేస్తున్నారని రాయబార కార్యాలయ అధికారి మరొకరు చెప్పారు.

Image copyright Constantinis
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

అయితే వీరిని కిడ్నాప్ చేసింది ఎవరో తెలియలేదన్నారు.

ఈ అధికారులను విడిపించేందుకు తాము చర్యలు ముమ్మరం చేశారని తెలిపారు.

అప్గానిస్తాన్‌లో కిడ్నాప్ చేయడం.. భారీగా డబ్బులు డిమాండ్ చేయడం సాధారణం. పేదరికం, పెరుగుతున్న నిరుద్యోగాలతో పరిస్థితి ఇంకా దిగజారింది.

2016లోనూ భారత ఉద్యోగిని ఒకరు కిడ్నాప్‌కి గురికాగా.. 40 రోజుల అనంతరం ఆమె విడుదలయ్యారు.

అఫ్గానిస్తాన్‌కు వెళ్లి పని చేసేవారికి భారత ప్రభుత్వం నిత్యం ప్రయాణ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది.

తాజాగా కిడ్నాప్‌కు గురైన వారు భారత్‌లోని ఏ రాష్ర్టానికి చెందినవారో కూడా తెలియాల్సి ఉంది.

మరోవైపు వీరిని తాలిబన్లు కిడ్నాప్ చేశారని స్థానిక గవర్నర్ వెల్లడించారు. అయితే తాలిబన్లు దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు