వీడియో: లావాలో కరిగిపోయిన కారు

  • 8 మే 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: లావాలో కరిగిపోయిన కారు

అమెరికాలోని హవాయిలో బిగ్ ఐలాండ్‌లోని కిలువేయా అగ్నిపర్వతం బద్దలైంది. దాదాపు వంద అడుగుల ఎత్తుకు లావా ఎగసిపడుతోంది. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.

మౌంట్ కిలువేయా మంగళవారం నాడు మొదటిసారి బద్దలైంది. అప్పటికే ఆ ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు 1,700 మందిని ఖాళీ చేయించి సహాయ శిబిరాలకు తరలించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: హవాయిలో బద్ధలైన అగ్నిపర్వతం; ఎగిసిపడుతున్న లావా

అక్కడ గాలిలో ప్రమాదకర సల్ఫర్ డైఆక్సైడ్ ప్రాణాంతక స్థాయిలో ఉందని.. అక్కడ బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే అత్యవసర బృందాలు సాయం చేయటం సాధ్యం కాదని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ పేర్కొంది.

ప్రపంచంలో చాలా క్రియాశీలంగా ఉన్న అగ్ని పర్వతాల్లో మౌంట్ కిలువేయా ఒకటి. ఇటీవల వరుసగా భూకంపాలు రావటంతో ఇది గురువారం బద్దలైంది.

Image copyright U.S. Geological Survey

"మేం లైలాని ఎస్టేట్స్‌లో నివసిస్తున్నాం. అగ్నిపర్వతం పేలుడుకు మైలు దూరంలోపే ఉంటుంది. రెండు గంటల కిందట మమ్మల్ని ఖాళీ చేయించారు. ఇప్పుడు మేం ఫ్రెండ్స్‌తో కలిసి ఉన్నాం.

అగ్నిపర్వతం బద్దలైన అరగంటకు నేను, నా కూతురు చూడటానికి వెళ్లాం. అర మైలు దూరం నుంచి ఆ పేలుడును చూశాం. దానికి ఎంత దగ్గరగా వెళ్తే అంత బాగా కనిపిస్తోంది."

Image copyright U.S. Geological Survey

"ఆ శబ్దం ఎవరో భారీ స్థాయిలో డ్రమ్ములు మోగిస్తున్నట్లు వినిపిస్తోంది. ఆ లావా శక్తి ఏంటో ఫీల్ కావచ్చు. ఆ రంగు.. ఆ శబ్దం నమ్మశక్యం కాదు" అని స్థానిక మహిళ మైజా స్టెన్‌బాక్ వివరించారు.

Image copyright U.S. Geological Survey

అగ్నిపర్వతం ఏ క్షణంలోనైనా బద్దలు కావచ్చునని, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు వారం రోజులుగా హెచ్చరిస్తూ ఉన్నారు.

గురువారం సాయంత్రం కూడా స్థానికులు కొందరు తమ ఇళ్లను వదిలి వెళ్లారు. ఇంకా ఎవరైనా అక్కడ ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ సూచిస్తోంది.

Image copyright USGS

"నా కుటుంబం క్షేమంగా ఉంది. మిగతా వాటిని మళ్లీ సంపాదించుకోవచ్చు. పద్నాలుగేళ్ల కిందట నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్నపుడు.. చివరికి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు. కానీ వాస్తవంలో ఇది జీర్ణమవటం కొంచెం కష్టంగానే ఉంది" అని స్థానికుడొకరు ‘హవాయి న్యూస్ నౌ’కి వివరించారు.

అగ్నిపర్వతం నుంచి ఎగసిపడుతున్న లావా పది గజాల దూరం మించి ప్రయాణించటం లేదు. ఈ పేలుడుతో సమీపంలోని లైలానీ ఎస్టేట్స్ నివాస ప్రాంతంలో రోడ్లపైనా పగుళ్లు ఏర్పడ్డాయి.

పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో భూకంపాల తీవ్రత పెరుగుతోంది. అగ్నిపర్వతానికి ఆగ్నేయంగా 6.9 తీవ్రత గల భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.

ఇదిలావుంటే.. అగ్నిపర్వతంలోని లావా సరస్సు స్థాయి నిలకడగా పడిపోతోందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు