మనకు వెలుగిచ్చే సూర్యుడికే మరణం వస్తే? ప్రపంచం అంతమైపోతుందా?

  • 10 మే 2018
సూర్యుడు Image copyright Getty Images

మన ప్రపంచం మొత్తం సూర్యుడి చుట్టూనే తిరుగుతోంది. సూర్యుడు కనిపిస్తే వెలుగొస్తుంది, సూర్యుడు కనిపించకుంటే చీకటైపోతుంది. కానీ ఏదో ఒక రోజు ఆ సూర్యుడు ఎప్పటికీ కనిపించకుండా పోతే? సూర్యుడు అంతమైతే, ప్రపంచం కూడా అంతమైపోతుందా?

చుక్కలు రాలడం మనం చూస్తూనే ఉంటాం.

కానీ మన సౌరవ్యవస్థ మధ్యలో మనమంతా సూర్యుడని పిలుచుకునే నక్షత్రం కూడా ఏదో ఒక రోజు అంతం అవుతుందనే మాట మీరెప్పుడైనా విన్నారా?

శాస్త్రవేత్తలు మరో 500 కోట్ల సంవత్సరాల్లో సూర్యుడి మరణం తథ్యం అంటున్నారు.

అదే జరిగితే తర్వాత ఏమవుతుందనేది మాత్రం వారికి ఇప్పటికీ తెలీదు.

Image copyright NASA

భారీగా సూర్యుడి ఆకారం

బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఈ వివరాలను తెలుసుకోగలిగింది.

ఈ ఘటనతో కాలంతోపాటూ జరిగే మార్పుల్లో కొన్నింటిని వాళ్లు ముందే చెప్పారు.

సూర్యుడు అంతమయ్యే సమయం సమీపించినప్పుడు అది ఇంటర్‌స్టెల్లార్ (నక్షత్రాల మధ్యలో ఉండే) గ్యాస్, ధూళితో మెరుస్తున్న ఒక వలయంలా రూపాంతరం చెందుతుంది అని ఈ ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ప్రక్రియను ప్లానెటరీ నెబులా (నీహారిక) అంటారు. ప్లానెటరీ నెబులా ప్రక్రియ సజీవంగా ఉన్న నక్షత్రాలను 90 శాతం వరకూ మార్చేస్తుంది. అదే జరిగితే ఎర్రగా మండే భారీ గ్రహమైన సూర్యుడి ఆకారం కూడా తెల్లగా ఉన్న ఒక చిన్న గోళంలా మారిపోతుంది.

'నేచర్ ఆస్ట్రానమీ' పేరుతో దీనిపై అధ్యయనం చేసిన ఆల్బర్ట్ జిజ్లస్ట్రా అనే ఒక రచయిత "ఒక నక్షత్రం అంతమైనప్పుడు దాన్నుంచి చాలా గ్యాస్, ధూళి వెలువడుతుంది. దాన్ని ఎన్వలప్ అంటారు. ఈ ధూళి, గ్యాస్ సూర్యుడి మొత్తం ద్రవ్యరాశిలో సగ భాగానికి చేరుకుంటుంది. ఈ ప్రభావం నక్షత్రాల న్యూక్లియస్ పైన కూడా పడుతుంది. న్యూక్లియస్ దీని సంపర్కంలోకి వచ్చినపుడు అవి కూడా మెల్లమెల్లగా బలహీనమైపోయి మరణిస్తాయి" అని చెప్పారు.

Image copyright Getty Images

సూర్యుడి అంతం ఎలా ఉంటుంది?

"నక్షత్రాల లోపలి భాగం వేడిగా ఉండడంతో దాన్నుంచి వెలువడిన గ్యాస్, ధూళి 10 వేల సంవత్సరాల వరకూ అది వెలుగులు చిమ్మేలా చేస్తుంది. ఇది ఖగోళ శాస్త్రంలో చాలా తక్కువ కాలంగా భావించాలి" అని శాస్త్రవేత్తలు అన్నారు.

"ఇలా జరగడం వల్ల ప్లానెటరీ నెబులా కనిపిస్తుంది. కొన్ని నెబులాలు ఎంత వెలుగులు చిమ్ముతాయంటే వాటిని కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరం నుంచి కూడా చూడవచ్చు."

మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన ఆల్బర్ట్ జిజ్లస్ట్రా.. "కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న నక్షత్రాల వివరాలు తెలుసుకోవడమే కాదు, సూర్యుడు మరణించేటపుడు ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోగలిగాం" అని తెలిపారు.

అధ్యయనం పూర్తయ్యే ముందు వరకూ సూర్యుడికి కూడా ఇలా జరుగుతుందనే విషయం శాస్త్రవేత్తలకు కచ్చితంగా తెలీదు.

Image copyright Getty Images

దశాబ్దాల నాటి వాదన

సూర్యుడికి ఏం జరుగుతోంది అనేది తెలుసుకోడానికి ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త డేటా మోడల్ తయారు చేశారు.

ఈ డేటా మోడల్ వేర్వేరు బరువు, వయసున్న నక్షత్రాల నుంచి వెలువడే వెలుగు భవిష్యత్తులో ఏమవుతుందో చెబుతుంది.

ఈ కొత్త మోడల్ సేకరించిన డేటా, ఊహాజనిత శాస్త్రీయ నమూనా మధ్య వైరుధ్యాలను వెలుగులోకి తెచ్చే పనిచేస్తుంది.

"గణాంకాలు చెబుతున్న దాని ప్రకారం సూర్యుడి లాంటి తక్కువ బరువున్న నక్షత్రం నుంచి మనకు మెరిసే ప్లానిటరీ నెబులా లభించవచ్చు" అని ఆల్బర్ట్ చెప్పారు.

"దీనికి ముందు నమూనాలు అలా జరగదని చెబుతున్నాయి. కనీసం సూర్యుడి బరువుకు రెట్టింపు బరువున్నట్టు కనిపించే నక్షత్రం మాత్రమే ప్లానిటరీ నెబులా అవుతుందని" అవి అంటున్నాయి.

Image copyright NASA

బలహీనమైనా మెరుస్తుంది

ఇప్పుడు తెలిసిందేంటంటే నక్షత్రాలు అంతమయ్యే సమయంలో వాటి నుంచి గ్యాస్, ధూళి బయటపడితే, అవి మొదట అనుకున్న దాని ప్రకారం మూడు రెట్లు ఎక్కువ వేడిగా మారుతాయి.

సూర్యుడి లాంటి తక్కువ బరువున్న నక్షత్రం కూడా మెరిసే ప్లానిటరీ నెబులా అవుతుందనడానికి ఇదే కారణం.

అయినా అది మనకు కనిపించే ప్లానిటరీ నెబులాగా మారుతుంది. అది చాలా బలహీనంగా కూడా ఉంటుంది.

చివరగా "ఈ పరిశోధనలో ఉత్తమ ఫలితాలు వచ్చాయని" ఆల్బర్ట్ తెలిపారు. ఇప్పుడు మనం సౌర వ్యవస్థలో దూరంగా ఉన్న లక్షల సంవత్సరాల నాటి కొన్ని నక్షత్రాల గుట్టు విప్పే పద్ధతిని తెలుసుకోవడమే కాదు, సూర్యుడు అంతమైనప్పుడు ఏం చేస్తాడు అనేది కూడా తెలుసుకోగలిగాం" అన్నారు.

ఇవి కూడా చూడండి:

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ష్.. సూర్యుడు శబ్దం చేస్తున్నాడు!

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

డోనల్డ్ ట్రంప్: ‘భారత్, చైనాల సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధం’

అందమైన ఈ గ్రామం మునిగిపోతోంది

బోరుబావిలో పడిన బాలుడు: మెదక్ జిల్లాలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు

నిన్నటి వరకు హీరోలన్నారు.. ఇవాళ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు: ఇటలీ వైద్య సిబ్బంది ఆవేదన

పాకిస్తాన్ నుంచి మిడతల దండు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వైపు వచ్చేస్తోందా

‘మా నాన్నకు కరోనా ముప్పు ఉంది. వెంటనే జైలు నుంచి విడుదల చేయండి’: విరసం నేత వరవర రావు కుమార్తెలు

పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం ఎలా

లాక్‌డౌన్ సడలిస్తే మనకు ముప్పు తప్పదా

కరోనావైరస్: అంటార్కిటికాలో మైనస్ 40 డిగ్రీల చలిలో ‘భారతి మిషన్’ పరిశోధకులు ఎలా ఉన్నారు?