ఈవారం బతుకు సిత్రాలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బతుకు సిత్రాలు: ముస్లింలను ఆకర్షిస్తున్న తమిళ పండుగ

  • 10 మే 2018

అఫ్గానిస్తాన్‌లో తేనెటీగల సంరక్షణ పురుషుల పనని అంటారు. కానీ బల్క్ ప్రావిన్స్ లోని ఒక టీనేజర్ ఫోరుజాన్ ఆలోచన మాత్రం మరోలా ఉంది. ఆమె తన తేనెటీగల ఫార్మ్‌లో మొదటి సీజన్లోనే పదహారు కిలోల తేనెను ఉత్పత్తి చేయగలిగారు.

ఈమె ఈ ఫార్మ్‌ను నడిపిస్తున్న తీరు చూసి తన తల్లితండ్రులు గర్వ పడుతున్నారని ఆమె అన్నారు. నాణ్యమైన తేనెకు అఫ్గాన్ పెట్టింది పేరు. కానీ చౌక దిగుమతులు అక్కడి స్థానిక ఉత్పత్తిదారులను ఒత్తిడిలోకి నెట్టేశాయి.

...

ఉత్తర పాకిస్తాన్‌లోని చిత్రల్ పర్వత ప్రాంతం అందమైన ప్రకృతి దృశ్యాలకు నెలవు. గతంలో ఈ ప్రాంతం సాహస ప్రేమికులు, పర్యాటకులతో కళకళలాడుతూ స్థానికులకు మంచి ఆదాయం కల్పించేది. కానీ అంతర్జాతీయ పర్యాటకుల మీద ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఇక్కడకు పర్యాటకులు రావడం తగ్గిపోయింది.

సైఫుల్లా జాన్ స్థానిక అధికారి. ఈ ప్రాంతం మొత్తం ఇపుడు బాధ పడుతోందని ఆయన అంటున్నారు. భద్రతాపరమైన ఆందోళనలు కూడా పాకిస్తాన్ లో పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయినా పారా గ్లైడర్లు వస్తే.. సైఫుల్లా జాన్ ఇక్కడ ఒక జాతీయ పోటీ నిర్వహించాలనుకుంటున్నారు.

...

ఇది భారతదేశం కాదు. ఇండోనేసియాలోని అచే ప్రావిన్స్ రాజధాని ఇది. ఇక్కడ ఎక్కువగా ముస్లిం జనాభాయే ఉంటుంది. అయినా మైనారిటీలు అయిన తమిళ హిందువులు ప్రతి సంవత్సరం పంగుణి ఉత్తిరమ్ అనే పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో అక్కడి ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొంటారు.

ఇక్కడి తమిళ హిందూ పూజారి రాధ కృష్ణ మాట్లాడుతూ ఈ పండుగ చాలా మంది పర్యాటకులను, తమ పొరుగు దేశమైన మలేసియా లోని ముస్లింలను కూడా ఆకర్షిస్తుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)