సిరియాలో ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి

  • 10 మే 2018
రాకెట్ దాడులు Image copyright Syrian state TV

సిరియాలో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై దాడులకు ప్రతిగా .. ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది.

ఈ ఇజ్రాయెల్ చర్యతో ముగ్గురు చనిపోయారని సిరియా సైన్యం తెలిపింది.

అయితే దీనికి సంబంధించి ఇరాన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

బుధవారం రాత్రి గోలన్ హైట్స్‌లో తమ స్థావరాలపై ఇరాన్‌కు చెందిన సైన్యం 20 రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ తెలిపింది.

దీనికి ప్రతిగా తాము ఇరాన్ సైన్యానికి చెందిన స్థావరాలు, రవాణా కేంద్రాలు, ఆహార కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది.

సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు, ఆయన ప్రభుత్వానికి మద్దతుగా ఇరాన్ తమ సైన్యాన్ని అక్కడకు పంపింది.

Image copyright AFP

గోలన్‌లో ఏం జరిగింది?

వాయువ్య సిరియాలోని కఠిన శిలలుండే ప్రాంతం గోలన్ హైట్స్. ఇది డమాస్కస్‌కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇందులో ఎక్కువ ప్రాంతాన్ని 1967లో ఇజ్రాయెల్ ఆక్రమించింది.

ఈ నేపథ్యంలో ఇక్కడున్న తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దళాలు 20 రాకెట్లతో దాడి చేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

వీటిలో నాలుగు రాకెట్లను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాధన్ తెలిపారు. మిగిలిన రాకెట్లు లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యాయని.. ఎవరూ గాయపడలేదని వివరించారు.

సిరియాలో యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న మానవ హక్కుల సంస్థ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ కూడా గోలెన్ వైపు పలు రాకెట్లను ప్రయోగించారని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)