బ్రిటన్ పార్లమెంట్ మహిళలు ఎప్పుడు అడుగుపెట్టారో తెలుసా..?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#BBCArchives: రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఎందుకు ఆలస్యమయ్యింది?

  • 15 మే 2018

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పార్లమెంటుగా పేరున్న బ్రిటన్ పార్లమెంటులో ఒక మహిళ అడుగు పెట్టడానికి ఎన్ని వందల ఏళ్లు పట్టిందో తెలుసా? దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో స్త్రీ అడుగు పెట్టిన ఎన్నేళ్ల తర్వాత ఎగువ సభలో ప్రవేశం లభించిందో ఎప్పుడైనా చరిత్ర తిరగేశారా? అరుదైన విశేషాలను బిబిసి ఆర్క్వైవ్స్‌లో మీకందిస్తున్నాం.

14వ శతాబ్దం ఆరంభంలో హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆవిర్భవించింది. అయితే అందులో ఓ మహిళ అడుగు పెట్టేందుకు మాత్రం 650 ఏళ్లు పట్టింది. కొందరు పురుష సభ్యులు అసలు ఆ ఆలోచననే ఇష్టపడలేదు.

యూకేలో మహిళలు లేకుండా పురుషులు మాత్రమే సమావేశం కాగల ఏకైక స్థలం ఏది?

యూకేలో మహిళలు లేకుండా కేవలం పురుషులు మాత్రమే సమావేశం కాగల ఏకైక స్థలం హౌస్ ఆఫ్ లార్డ్స్ మాత్రమేనని 1957లో 8వ ఎర్ల్ ఆఫ్ గ్లాస్గో పాట్రిక్ బోయెల్ అన్నారు. దీన్ని ఇలాగే ఉంచడం మంచిదని కూడా వ్యాఖ్యానించారు.

అయితే ఆ వ్యతిరేకత అలా ఉండగానే 1958లో లైఫ్ పీరేజెస్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఫలితంగా వారసత్వ హక్కులో భాగంగా కొత్త సహచరులు సభలో ప్రవేశించే అవకాశం కలిగింది.

ఆ పై ఎగువ సభలో తొలిసారిగా ఒక మహిళ అడుగు పెట్టారు.

సభ్యులకు కుమారులు లేకపోతే వారి వారసులుగా వారి కుమార్తెలకు సభ్యత్వం కల్పించేందుకు మరో ఐదేళ్లకు అనుమతి లభించింది.

ఫలితంగా ఒక్కసారిగా 12 మంది మహిళలకు హౌజ్ ఆఫ్ లార్డ్స్‌లో సభ్యత్వం లభించింది.

60 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న 787 మంది సభ్యుల్లో మహిళల సంఖ్య కేవలం 205 మాత్రమే. అంటే మొత్తం సభ్యుల్లో స్త్రీల వాటా కేవలం 26శాతమే.

హౌజ్ ఆఫ్ కామన్స్‌లో ఎన్నికైన సభ్యులతో పోల్చితే వీరి సంఖ్య తక్కువనే చెప్పాలి. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 650 మంది ఎంపీల్లో 32 శాతం అంటే 208 మంది మహిళలు ఉన్నారు.

మా ఇతర కథనాలు చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)