ఈ శిథిల నగరమే పర్యటకులకు ఇష్టం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

చైనా: మృతదేహాల అవశేషాలతో నిండిన ఈ శిథిల నగరం పర్యటకులకు ఎందుకిష్టం?

  • 16 మే 2018

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ ఒకప్పుడు అన్ని నగరాల్లానే జనాలతో కళకళలాడుతుండేది. కానీ పదేళ్ల క్రితం అక్కడో భారీ భూకంపం వచ్చింది. దాని ధాటికి దాదాపు 87వేల మంది చనిపోయారు.

ఎన్నో భవనాలు నేలమట్టమయ్యాయి. ఇంకొన్ని భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రావిన్స్‌లో ఎవరూ ఉండట్లేదు. చనిపోయినవారి గుర్తుగా అక్కడి భవనాలను కూడా తొలగించకుండా అలానే వదిలేశారు.

ఇప్పుడా శిథిల భవనాలే పర్యటకులకు ప్రధాన ఆకర్షణగా మారాయి. ఏటా లక్షలాది పర్యటకులు ఆ నగరాన్ని చేరుకొని వీటిని సందర్శిస్తున్నారు.

ఇప్పటికీ ఈ శిథిలాల కింద వేలాది మృతదేహాల అవశేషాలు అలానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు