ఈ గోల్కొండ వజ్రం ఖరీదు చెప్పగలరా?

  • 16 మే 2018
డైమండ్ Image copyright EPA

ఈ అరుదైన నీల వర్ణపు వజ్రం ఖరీదు ఎంతో ఊహించగలరా?

300 ఏళ్ల పాటు యూరప్‌లోని ధనికుల ఇళ్లలో ఉన్న ఈ వజ్రాన్ని జెనీవాలో వేలం వేశారు.

అక్కడ దీని ధర 67 లక్షల డాలర్లు పలికింది. అంటే రూ.45.40 కోట్లు పలికింది.

1715లో పర్మా రాజకుమారుడి కుమార్తె ఎలిజబెత్ ఫర్నీస్‌కి దీన్ని పెళ్లి కానుకగా ఇచ్చారు.

ఆమె స్పెయిన్‌కి చెందిన ఫిలిప్‌ని పెళ్లాడారు.

తరాలు మారే కొద్దీ ఈ వజ్రం స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, అస్ర్టియాలకు తరలి వెళ్లింది.

ఇంతకీ ఈ వజ్రం లభ్యమైంది మాత్రం భారత్‌లో.

6.1 క్యారెట్ల ఈ వజ్రం గోల్కొండ ప్రాంతంలో దొరికింది.

తర్వాత విదేశాలకు తరలివెళ్లింది.

దీన్ని సొథెబే వేలంలో పెట్టగా కేవలం నాలుగు నిమిషాల్లోనే అమ్ముడైంది.

ఈ సందర్భంగా వేలం నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ వజ్రం వేలాన్ని 35 లక్షల డాలర్ల వద్ద ప్రారంభించగా.. అది 67 లక్షల డాలర్లు పలికిందని తెలిపారు.

ఈ వజ్రాన్ని కొనుగోలు చేసింది ఎవరో బయటకు చెప్పలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు