ఘనంగా జరిగిన మేఘన్-హ్యారీల వివాహం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#RoyalWedding: ఘనంగా జరిగిన మేఘన్-హ్యారీల వివాహం

  • 20 మే 2018

బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల వివాహం బ్రిటన్ వేసవి కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం (భారత్‌లో సాయంత్రం) ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది.

బెర్క్‌షైర్ కౌంటీలోని విన్సర్ పట్టణంలోని రాజ భవనం విన్సర్ క్యాజిల్‌ ఈ వివాహ వేడుకకు వేదిక.

విన్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్స్ ఛాపెల్‌లో ఎలిజబెత్ రాణి, 600 మంది అతిథుల సమక్షంలో వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.

ఇప్పటివరకున్న రాజకుటుంబ సంప్రదాయానికి భిన్నంగా హ్యారీ పెళ్లి ఉంగరం ధరించారు. వధూవరులు ప్రమాణాలు చేసే సమయంలో ''విధేయురాలై ఉంటాను'' అనే మాటను మేఘన్ మార్కెల్ ఉచ్చరించలేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)