నేటి ముఖ్యాంశాలు: అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐపై విచారణకు ఆదేశించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల ప్రచారంలో 'అనుచిత ప్రయోజనాల' కోసం ఎఫ్‌బీఐ ఏజెంట్లు గూఢచర్యం చేశారా? అన్న అంశంపై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు చేయనుంది.

రాజకీయ కారణాలతో తన ఎన్నికల ప్రచారంపై ఎవరైనా నిఘా పెట్టారా అనేది తెలుసుకోవడానికి ఈ విచారణ జరుగుతుందని, ఎఫ్‌బీఐ గూఢచర్యం వెనుక గత పాలకుల ఆదేశాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఎఫ్‌బీఐకి చెందిన ఒక ఇన్‌ఫార్మర్ ట్రంప్ ప్రచార సహాయకులను కలిసినట్టు అమెరికా మీడియా నివేదికలు సూచించాయి.

ఈ ప్రచారానికి సంబంధించి ఇప్పటికే అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

ఆదివారం కూడా ట్రంప్ వరుస ట్వీట్స్ చేశారు. తనను అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటివరకూ రష్యాతో ఎలాంటి రహస్య ఒప్పందం చేసుకోలేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

దిగుమతి సుంకాల అమలును ఆపేసిన అమెరికా, చైనా

శిక్షార్హమైన దిగుమతి సుంకాల అమలును నిలిపివేస్తున్నట్టు చైనా, అమెరికా ప్రకటించాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరిగే అవకాశాన్ని హోల్డ్‌లో ఉంచాయి.

200 బిలియన్ డాలర్ల అమెరికా వస్తు సేవలను చైనా కొనుగోలు చేసేలా ఒప్పించడానికి, తద్వారా వాణిజ్య అసమతౌల్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో అమెరికాలో చర్చల తర్వాత ఒక ఒప్పందం కుదిరింది. దీని గణాంకాలు విడుదల చేయకపోయినప్పటికీ, చైనా ఈ ఒప్పందాన్ని అమలు చేయకపోతే అమెరికా 150 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలు విధిస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ నుచిన్ చెప్పారు.

చైనా ఉప ప్రధాని లియు ఈ ఒప్పందాన్ని "విన్-విన్ చాయిస్‌"గా వర్ణించారు.

భవిష్యత్తులో వారితో శాంతితో వ్యవహరించేందుకు, కొన్ని అంశాలను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిగాయని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, EPA

హవాయ్ అగ్నిపర్వతం: కిలౌయియాలో లావా పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

హవాయిలో కొన్ని వారాల నుంచీ అగ్నిపర్వతం పేలుళ్లు కొనసాగుతుండడంతో ప్రవహిస్తున్న లావా వల్ల మొట్టమొదట ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు సమాచారం అందింది.

గాయపడ్డ వ్యక్తి తన ఇంట్లో బాల్కనీలో కూర్చుని ఉన్నప్పుడు అతడిపై లావా, కరిగిన రాయి చెదిరి పడ్డాయి.

"అది అతడికి కాలిపై పడింది. తన కాలు కింద ఉన్న మొత్తం ముక్కలైపోయింది" అని ఆ దేశ మేయర్ అధికార ప్రతినిధి తెలిపారు.

చెదిరి పడే లావా బురద ఒక రిఫ్రిజరేటర్‌ అంత బరువు ఉంటుందని ఆమె రాయ్‌టర్స్‌కు చెప్పారు.

హవాయిలోని పెద్ద ద్వీపంలో ఉన్న కిలౌయియా అగ్నిపర్వతం మే ప్రారంభంలో పేలింది. అక్కడ నివసిస్తున్న వారి పరిస్థితి అంతకంతకూ ఘోరంగా మారుతోంది.

శనివారం, అక్కడ ఉన్న వారిని తప్పించడానికి ప్రధాన మార్గంగా ఉపయోగిస్తున్న ఒక తీర రహదారి కోసుకుపోయి ప్రమాదంలో పడడంతో తరలించడానికి అడ్డంకిగా మారింది.

లావా ప్రవాహం సముద్రంలోకి చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల విడుదలయ్యే విష వాయువుల వల్ల లేజ్ అనే పొగమేఘాలు ఏర్పడే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)