జైలులో పుట్టారు.. జైలులోనే పెరుగుతున్నారు

ఆఫ్రికన్ దేశమైన జాంబియాలోని జైళ్లలో అనేక మంది పసి పిల్లలు మగ్గిపోతున్నారు. వారిలో కొందరు జైలు ఊచల వెనకే పుట్టి.. అక్కడే పెరుగుతున్నారు.
మరికొందరేమో తమ తల్లులకు జైలు శిక్ష పడటం వల్ల వాళ్లు కూడా జైలుకు వెళ్లారు.
వాళ్లకు చదువు లేదు. ఆట లేదు, పాట లేదు. బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియదు.
వాళ్లేమీ బాల నేరస్థులు కాదు. కానీ జైలు వాతావరణంలో పెరుగుతున్నందు వల్ల ఆ చిన్నారులు కూడా ఖైదీల్లాగే ప్రవర్తిస్తున్నారు.
అలా జైలు నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న ఆ చిన్నారులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు ఓ మహిళ.
ఆమె పేరు ఫెయిత్ కలుంగియా. 'బీబీసీ అవుట్‌లుక్ ఇన్స్పిరేషన్స్ 2018' పురస్కారాలకు ఆమె నామినేట్ అయ్యారు.
పూర్తి కథనం కోసం పై వీడియో చూడండి.
ఇలా 'బీబీసీ అవుట్‌లుక్ ఇన్స్పిరేషన్స్ 2018' పురస్కారాలకు ఆమె నామినేట్ అయిన మిగతా వారి గురించి తెలుసుకునేందుకు ఈ కింది లింకు క్లిక్ చేయండి.
www.bbcworldservice.com/outlookinspirations
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)