కిమ్‌తో శిఖరాగ్ర సమావేశం ఆలస్యం కావొచ్చు: ట్రంప్

  • 22 మే 2018
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ Image copyright Reuters
చిత్రం శీర్షిక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ (ఫైల్ ఫొటో)

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్‌తో వచ్చే నెలలో జరగాల్సిన చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం ఆలస్యం కావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

వైట్ హౌస్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌కు స్వాగతం పలికిన తర్వాత ఆయన ఈ విషయం వెల్లడించారు. వారిద్దరూ ఈ శిఖరాగ్ర సమావేశం గురించి చర్చించనున్నారు.

'కిమ్ నుంచి ఏం ఆశించవచ్చు, ఏం ఆశించగూడదు' అనే విషయాల్ని మూన్ ఈ భేటీలో ట్రంప్‌కు వివరించే అవకాశం ఉందని దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్హాప్ తెలిపింది.

ఉత్తర కొరియా ఏకపక్షంగా అణ్వాయుధాల్ని త్యజించాలని అమెరికా పట్టుబడితే తాము ట్రంప్‌తో శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసుకుంటామని ఉత్తర కొరియా గత వారం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)