పేదలకూ, సంపన్నులకూ మధ్య తేడా తెలియాలంటే ఈ ఫొటోల్ని చూడాల్సిందే!

ఫొటో సోర్స్, Johnny Miller/Millefoto
ముంబై, భారత్
అసమానతల గురించి చాలామంది మాట్లాడుతుంటారు. కానీ వాటిని ఫొటోల్లో చూపడం కాస్త కష్టమే. జానీ మిల్లర్ అనే ఓ ఫొటోగ్రాఫర్ ఆ పని చేశారు.
భారత్‌లోని ముంబై మహానగరం నుంచి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వరకు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక పెద్ద నగరాల్లో పేదల ఇళ్లూ, సంపన్నుల ఇళ్లకూ మధ్య ఉన్న తేడాను చూపించేందుకు డ్రోన్ల సాయంతో అనేక ఫొటోలను తీశారు.
ఆ ఫొటోలను గమనిస్తే నగరాల్లో పేదవారి గృహాలు, సంపన్నుల గృహాల మధ్య ఎంత తేడా ఉందో అర్థమవుతుంది.
ఫొటో సోర్స్, Johnny Miller/Millefoto
ఆయిస్టర్ బే, కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా
ఫొటో సోర్స్, Johnny Miller/Millefoto
నైరోబీ, కెన్యా
ఫొటో సోర్స్, Johnny Miller/Millefoto
కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా
ఫొటో సోర్స్, Johnny Miller/Millefoto
శాంటా ఫే, మెక్సికో
ఫొటో సోర్స్, Johnny Miller/Millefoto
జోహనెస్బర్గ్, దక్షిణాఫ్రికా
ఫొటో సోర్స్, Johnny Miller/Millefoto
డెట్రాయిట్, యూఎస్
మొదట దక్షిణాఫ్రికాలో జానీ మిల్లర్ ఈ ఫొటోగ్రఫీ ప్రయాణాన్ని మొదలుపెట్టి తరవాత భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలకు విస్తరించారు.
‘ఈ ఫొటోల వల్ల ఏదైనా బాధ, ఇబ్బంది కలిగితే మంచిదే. ఈ ఫొటోలను తీయడం వెనక ఉద్దేశం కూడా అదే. జనాలు వీటి గురించి ఆలోచిస్తేనే ఈ ఫొటోలకు న్యాయం జరుగుతుంది’ అన్నారు జానీ.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)