మైకేల్ జాక్సన్‌: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?

  • 24 మే 2018
మైకేల్ జాక్సన్ స్టెప్ Image copyright MaNJUL TRIPATHI

నడుము వంచకుండా ఏటవాలుగా అలా ముందుకు వాలిపోయే స్టెప్ ఎవరు వేయగలరు?

ఈ పాటికి ఆ వ్యక్తి ఎవరో మీరు ఊహించే ఉంటారు.. ఆ స్టెప్ మైకేల్ జాక్సన్ సొంతం!

'స్మూత్ క్రిమినల్' మ్యూజిక్ వీడియోలో చేసిన ఆ స్టెప్.. ప్రేక్షకులను అబ్బురపరచింది.

అయితే.. మానవ శరీరంతో అసాధ్యమనిపించే ఈ స్టెప్ వెనుకనున్న కిటుకును న్యూరో సర్జన్లు వివరించారు.

1987లో విడుదలైన ఈ వీడియో ఆల్బమ్‌లో మైకేల్ జాక్సన్ ఈ స్టెప్‌ వేశారు. చీలమండపై భారం మోపుతూ.. శరీరాన్ని ఎక్కడా వంచకుండా, ఓ కట్టెలాగ నిటారుగ 45 డిగ్రీల కోణంలో ముందుకు వాలిపోతాడు జాక్సన్.

Image copyright Getty Images

ఈ భంగిమను అనుకరించడానికి చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు.

అయితే.. ఇలాంటి నృత్య భంగిమలో మైకేల్ జాక్సన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 'షూస్' కీలక పాత్ర పోషించాయని, జాక్సన్ శరీర దారుఢ్యం, పటుత్వం అందుకు ఎంతగానో తోడ్పడ్డాయని వైద్యులు చెబుతున్నారు.

కానీ.. ఈ స్టెప్‌ను అనుకరించడం వెన్నెముకకు అంత మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నారు.

''ఉక్కులాంటి శరీరం కలిగి, డాన్స్‌లో మంచి శిక్షణ తీసుకున్న డాన్సర్లు కూడా కేవలం 25-30 డిగ్రీల కోణంలో మాత్రమే ముందుకు వాలగలరు. కానీ మైకేల్ జాక్సన్ మాత్రం.. ఏకంగా 45 డిగ్రీల కోణంలో శరీరాన్ని ఏమాత్రం వంచకుండా ముందుకు వాలాడు. ప్రేక్షకులకు ఇది ఓ అసాధారణ భంగిమ!'' అని చండీఘడ్‌లోని 'పీజీఐ'కి చెందిన వైద్యుల బృందం పేర్కొంది.

Image copyright RUBENRAMOS

మైకేల్ జాక్సన్ ఎలా చేశాడు?

‘స్మూత్ క్రిమినల్’ వీడియోలోని ఈ భంగిమను చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, వారి చీలమండలో, కండరాలు పట్టేయడం, తీవ్రమైన నొప్పి పుట్టడం జరుగుతుంది.

''మైకేల్ జాక్సన్ వంటి శరీర పటుత్వం ఉన్నవారు కూడా కొద్ది మేర మాత్రమే ఈ స్టెప్‌ను చేయగలరు'' అని పీజీఐ అసిస్టెంట్ ప్రొఫెసర్ మంజుల్ త్రిపాఠి వివరించారు.

మైకేల్ జాక్సన్ వాడిన షూ హీల్స్‌ కింది భాగంలో ఇంగ్లీష్ అక్షరం 'వి' ఆకారంలో మాదిరి ఓ చీలికను ఏర్పాటు చేశారు. నేల లేదా స్టేజ్ ఉపరితలంలో ఏర్పాటు చేసిన మేకు లాంటి వస్తువుకు ఆ షూస్‌ కింది భాగం (‘వి’ ఆకారపు చీలిక) చిక్కుకునేలా చేసి, దాని ఆధారంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వంగుతారు.

Image copyright MaNJUL TRIPATHI

ఈ ప్రత్యేకమైన షూస్ వాడకానికి పూర్వం సపోర్టింగ్ తీగలు, శరీరాన్ని బ్యాలెన్స్ చేసేందుకు తన ఛాతి భాగం చుట్టూ ఓ కవచాన్ని మైకేల్ జాక్సన్ వాడేవాడు. వాటి సాయంతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసేవాడు.

అమెరికా వ్యోమగాములు వాడే ‘బూట్స్’ నుంచి ఈ ప్రత్యేకమైన షూస్ తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందని, తన ఇద్దరు హాలీవుడ్ మిత్రుల సహాయంతో ఈ ప్రయత్నంలో మైకేల్ జాక్సన్ విజయం సాధించారని చెబుతారు.

కానీ.. ఎంత ప్రత్యేకమైన షూస్ వాడినా ఈ స్టెప్ ప్రదర్శించడం మామూలు విషయం కాదని, అందుకు శరీర పటుత్వం గొప్పగా ఉండాలని అంటారు. ముఖ్యంగా వెన్నెముక, నడుములోని కండరాలు దృఢంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

''ఈ స్టెప్ వేస్తున్నపుడు చీలమండ గాయపడుతుంది. ఇలా చేయాలంటే దృఢమైన కండరాలతోపాటు చీలమండకి తగినంత సపోర్ట్ అవసరం. ఈ జాక్సన్ ట్రిక్.. సాధారణమైందేమీ కాదు..'' అని త్రిపాఠి అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహా 49 మందికి హైకోర్టు నోటీసులు

ఇందిరా గాంధీ పేరు చెప్పి, ఒక్క ఫోన్ కాల్‌తో అప్పట్లో రూ.60 లక్షలు కాజేశారు

వలస కూలీల కష్టాలపై స్పందించిన సుప్రీంకోర్టు.. సుమోటోగా విచారణ.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు

లాక్ డౌన్: రాహుల్ గాంధీ వ‌ర్సెస్ ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్

ప్రధానితో కాళ్లు కడిగించుకున్న పారిశుద్ధ్య మహిళలు ఈ లాక్‌డౌన్ కాలంలో ఎలా ఉన్నారు

రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే

ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఫ్యాక్టరీ అత్యవసరంగా తెరిచేందుకు అనుమతి

వీడియో: ఫేస్ మాస్కులు ధరించడంలో తప్పులు, ఒప్పులు

తేమ నిండిన ఎండలు ఎంత ప్రమాదకరం.. ఎవరికి ప్రాణాంతకం