బీబీసీ-విశ్వవీక్షణం: కిమ్, ట్రంప్ భేటీ అవుతున్నారా? లేదా?

కిమ్‌తో పాంపియో భేటీ
ఫొటో క్యాప్షన్,

కిమ్‌తో పాంపియో భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ల భేటీ కిమ్‌పైనే ఆధారపడి ఉందని అమెరికా పేర్కొంది.

ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో వెల్లడించారు.

ట్రంప్.. కిమ్ మధ్య జూన్ 12న సింగపూర్‌లో భేటీ జరుగుతుందని మొదట ట్రంప్ ప్రకటించారు.

తర్వాత ఈ భేటీ రద్దు కావొచ్చని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఈ భేటీపై వచ్చేవారం స్పష్టత వస్తుందని ట్రంప్ చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

పెట్రో పోరోషెంకో , ట్రంప్ భేటీ అయినప్పటి దృశ్యం

వైట్ హౌస్‌తో చర్చల కోసం ట్రంప్ లాయర్‌కు రహస్య చెల్లింపులు

ఉక్రెయిన్ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మధ్య చర్చలు ఏర్పాటు చేసేందుకు ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైకేల్ కోహెన్‌ రూ.2.75 కోట్లకు పైగా ( 4 లక్షల డాలర్లు ) రహస్య ముడుపులు అందుకున్నట్టు తాజాగా బయటపడింది.

ఈ మొత్తాన్ని ఉక్రెయిన్ నేత పెట్రో పోరోషెంకో మధ్యవర్తులు ఆయనకు అందించినట్టు ఆ చర్చల్లో పాల్గొన్నవారి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అయితే అమెరికా చట్టాలకు తగినట్టు కోహెన్ ఉక్రెయిన్ ప్రతినిధిగా రిజిస్టర్ కాలేదు.

ఈ ఆరోపణలను కోహెన్ ఖండించారు.

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి

బాగ్దాద్‌లో గురువారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో నలుగురు చనిపోయారు.

మరో పది మంది గాయపడ్డారు.

ఈ మేరకు ఇరాక్‌లోని భద్రతాధికారులు వెల్లడించారు.

షియాలు అధికంగా ఉండే షులా జిల్లాలో ఓ గుర్తుతెలియని వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

క్రికెట్‌కు ఏబీ డివిలియర్స్ గుడ్‌బై

దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వీడియో సందేశం ద్వారా పేర్కొన్నాడు.

ఆ రకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున రాజస్థాన్ రాయల్స్‌తో మే19న ఆడిన ఐపీఎల్ మ్యాచే అతడికి చివరిది. డివిలియర్స్ తన చివరి టెస్ట్ ఆస్ట్రేలియాతో (మార్చి 2018లో), చివరి వన్డే భారత్‌తో (ఫిబ్రవరి 2018లో) ఆడాడు.

'నిజం చెప్పాలంటే నేను చాలా అలసిపోయాను. భారత్, ఆస్ట్రేలియాలపై అద్భుతమైన సిరీస్ విజయాలను సాధించాక, రిటైరవ్వడానికి ఇదే సరైన సమయం' అని తన సందేశంలో ఏబీ చెప్పాడు. దీంతో పద్నాలుగేళ్ల క్రికెట్ కెరీర్‌కు ఏబీ స్వస్తి పలికాడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)