రేప్ కేసులో హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌ అరెస్ట్

  • 25 మే 2018
హార్వే వైన్‌స్టీన్ Image copyright Reuters

కొందరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో హాలీవుడ్ సినీ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌పై న్యూయార్క్ పోలీసులు అత్యాచార అభియోగాలు నమోదు చేశారు.

అంతకు ముందు వైన్‌స్టీన్ స్వయంగా వెళ్లి న్యూయార్క్ పోలీసుల ముందు లొంగిపోయారు.

ఆయనపై పదుల సంఖ్యలో మహిళలు అత్యాచార, లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

అయితే, పరస్పర అంగీకారం లేకుండా తాను ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదని వైన్‌స్టీన్ చెబుతూ వచ్చారు.

కొన్ని నెలల క్రితమే అతనిపై ఆరోపణలు వచ్చినా అభియోగాలు నమోదు చేయడం ఇదే తొలిసారి.

"వైన్‌స్టీన్‌ను అరెస్టు చేశాం. అతడు ఇద్దరు మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపులు, లైంగిక దౌర్జన్యం, క్రూరమైన లైంగిక చర్యలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశాం" అని న్యూయార్క్ పోలీసు విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

"న్యాయం కోసం ధైర్యంగా ముందుకొచ్చిన బాధితులకు ధన్యవాదాలు" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

అయితే, ఆ అభియోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హార్వే వైన్‌స్టీన్‌

#MeToo లో వెల్లువెత్తిన ఆరోపణలు

#MeToo ఉద్యమంలో భాగంగా అనేక మంది నటీమణులు బయటకు వచ్చి వైన్‌స్టీన్‌పై ఆరోపణలు చేశారు.

ఆ ఆరోపణలు చేసిన వారిలో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీతో పాటు, రోస్ మెక్‌గోవాన్ లాంటివారు కూడా ఉన్నారు.

హాలీవుడ్ మూవీ మొఘల్‌గా పేరు తెచ్చుకున్న వైన్‌స్టీన్ నిర్మాతగా వ్యవహరించిన దాదాపు 300 సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. 81 ఆస్కార్ అవార్డులు అందుకున్నాయి.

అయితే, లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ఏడాది ఆస్కార్ బోర్డు అతన్ని బహిష్కరించింది.

చిత్రం శీర్షిక వైన్‌స్టీన్ మీద ఆరోపణలు చేసిన వారిలో ఏంజెలినా జోలి, గ్వెనెత్ పాల్‌ట్రో, కారా డెలవీన్ కూడా ఉన్నారు.

ఎవరెవరు లైంగిక ఆరోపణలు చేశారు?

1996లో ఎమ్మా సినిమాలో ప్రధాన పాత్రధారి అవకాశం ఇచ్చిన తర్వాత, వైన్‌స్టీన్‌ అతని హోటల్ గదికి తనను పిలిచాడని న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ప్రకటనలో అమెరికన్ నటి గ్వెనెత్ పాల్‌ట్రో చెప్పారు.

1990ల్లో లండన్‌లోని ఒక హోటల్ గదిలో తనను కింద పడేసి అసభ్యంగా ప్రవర్తించాడని, తాను పెనుగులాడి పాకుతూ తప్పించుకోగలిగానని మరో నటి ఉమా తుర్మాన్ ఆరోపించారు. అయితే, ఆమె చెప్తున్న మాటలు ‘అవాస్తవం’ అని వైన్‌స్టీన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

1998లో 'ప్లేయింగ్ బై హార్ట్' విడుదల సందర్భంగా వైన్‌స్టీన్ ఒక హోటల్ గదిలో తనతో శృంగారానికి ప్రతిపాదించినట్లు న్యూయార్క్ టైమ్స్‌తో ఏంజెలినా జోలి చెప్పారు.

ఆసియా అర్జెంటో, కారా డెలవీన్, హెథర్ గ్రాహమ్, జో బ్రోక్ , లూసియా స్టోలర్, మీరా సార్వినో, లూయిసెట్ గైస్ కూడా హార్వేపై ఆరోపణలు చేసిన వారి జాబితాలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

లాక్‌డౌన్ సడలించినా నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు

బాంబులు పెట్టిన పైనాపిల్ తినిపించి ఏనుగును చంపేశారు

ఆన్‌లైన్ క్లాసెస్ వినే అవకాశం లేక ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థిని

పెను తుపాను నుంచి తప్పించుకున్న ముంబయి నగరం.. రాయగడ జిల్లాలో తీవ్ర నష్టం

ఏది ప్రమాదకరం? అల్పపీడనం, వాయుగుండం, సైక్లోన్, సూపర్ సైక్లోన్ మధ్య తేడా ఏమిటి..

హిట్ల‌ర్‌‌లా మారిపోతున్న కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు

ప్రపంచ సైకిల్ దినోత్సవం: తొలి సైకిల్ ఎప్పుడు తయారైంది? ఏటా ఎన్ని సైకిళ్లు తయారవుతున్నాయి?

జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?

లాక్‌డౌన్ తర్వాత.. దిల్లీ - వైజాగ్: విమాన ప్రయాణం ఇలా సాగింది