కాళ్లందలేదని సైక్లింగ్ ఆపేసిన ఈమె కొండలపై 66 కిలోమీటర్లు ఎలా తొక్కింది?

ఎత్తైన పర్వతాలు, లోయలు! అక్కడ 66 కిలోమీటర్ల ప్రయాణం మైదాన ప్రాంతంలో 166 కిలోమీటర్ల ప్రయాణానికి సమానం. ఆ మార్గాన్ని సైకిల్ మీద ఆరుగంటల్లో పూర్తి చేశారు ఇస్లామాబాద్‌కు చెందిన ఔత్సాహికురాలు సమీరన్ ఖాన్.

సైక్లింగ్ పట్ల తన అభిరుచి, ఎదురైన సమస్యల గురించి ఆమె బీబీసీతో పంచుకున్నారు.

’గిల్జిత్ నుంచి నా సైకిల్ ప్రయాణం ప్రారంభమైంది. ఆరు గంటల్లో రకపోషి చేరుకున్నాను. నాకు సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టం, ఇస్లామాబాద్‌లో సైక్లింగ్ చేస్తుంటాను. చిన్నప్పుడు మా అన్నయ్య ఎత్తుకు తగ్గట్టుగా సైకిళ్లు సమకూర్చుకునేవాడు. నాకు కూడా సైక్లింగ్ అంటే ప్రాణం. వాడి సైకిళ్లనే తొక్కేదాన్ని. వాడు ఓ పెద్ద సైకిల్ తేవడంతో దాన్ని తొక్కేందుకు నాకు కాళ్లు అందేవి కాదు. దాంతో సైక్లింగ్ ఆపేశాను. ’’ అని వివరించారు.

తర్వాత ఆమె సైకిల్ ప్రయాణం ఎలా మొదలైంది.. చూడండి వీడియోలో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)